Home / Inspiring Stories / తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్(టాడ్) వారి 2016 క్యాలండర్ ఆవిష్కరణ.

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్(టాడ్) వారి 2016 క్యాలండర్ ఆవిష్కరణ.

Author:

విదేశాలలో తెలుగు అసోసియేషన్ ల కృషి అభినందనీయం. సంస్కృతి సాంప్రదాయాలను కొత్త తరం వారికి నేర్పించడంలో, విదేశాలలో ఉన్న తెలుగు వారికి ఆపన్న హస్తం అందిచడంలో వీరు ముందు ఉంటారు. అదే కోవలోని చెందిందే తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్(టాడ్). స్థాపించిన సంవత్సరంలోనే ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించి టాడ్ డెన్మార్క్ దేశంలో మంచి పేరు సంపాదించింది. రెండవ సంవత్సరంలోకి ప్రవేశించిన టాడ్, వారి 2016 నూతన సంవత్సర క్యాలండర్ ని నల్లగొండ .ఎమ్.ఎల్.సి శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన ఆవిష్కరించారు. .ఈ కార్యక్రమంలో డెన్మార్క్ నుండి వచ్చిన పలువురు టాడ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా టాడ్ ప్రతినిధి సతీష్ రెడ్డి సామ మాట్లాడుతూ, డెన్మార్క్ లోని తెలంగాణ వాసులకు, తెలుగు వారికి టాడ్ చేస్తున్న పనులను రాజగోపాల్ రెడ్డి గారికి వివరించి, అధికారక హోదాలో డెన్మార్క్ రావాల్సిందిగా ఆహ్వానించారు. ఎమ్.ఎల్.సి శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ, టాడ్ చేస్తున్న మంచి కార్యక్రమాలను కొనియాడారు మరియు తప్పకుండా డెన్మార్క్ ని ఒకసారి సందర్శిస్తానని, టాడ్ చేసే ప్రతి కార్యక్రామానికి తన సహకారం ఉంటుందని ప్రకటించారు. టాడ్ క్యాలండర్ ని ఆవిష్కరించిన ఎమ్.ఎల్.సి శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మరియు తెలుగు వారందరికీ డెన్మార్క్ నుండి టాడ్ ప్రెసిడెంట్ శ్రీ రాజరెడ్డి బద్దం, టాడ్ కార్యవర్గం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

(Visited 400 times, 1 visits today)