Home / Political / ప్రభుత్వ అధికారికి లంచం ఇవ్వడం కోసం బిచ్చమెత్తిన బాలుడు.

ప్రభుత్వ అధికారికి లంచం ఇవ్వడం కోసం బిచ్చమెత్తిన బాలుడు.

Author:

లంచగొండితనం మన దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. చాలా సందర్భాలలో లంచానికి సంబందించిన వార్తలు పాపులర్ కావు కాని, శవంపై మరమరాలు ఏరుకునే రేంజ్ కి చేరిన ఈ లంచగొండి అధికారికి తమిళనాడు కి చెందిన బాలుడు అజిత్ వినూత్న పద్దతిలో బుధ్ధి చెప్పాడు. అజిత్ తండ్రి కళంజి ఆరోగ్య సమస్యలతో గతేడాది చనిపోయాడు. పేదరికంలో మగ్గుతున్న ఆ కుటుంబ పెద్ద చనిపొవడంతో ఆ కుటుంబానికి దిక్కులేకుండా పొయింది. ప్రభుత్వం కనికరించి ఆ కుటుంబానికి 12,500 రూపాయల ఆర్ధిక సాయం మంజూరు చేసింది. ఇక అప్పటినుండే ఆ కుటుంబానికి అసలు కష్టాలు మొదలయ్యాయి.

boy begging to give bribe

లంచాలకు అలవాటు పడిన ప్రభుత్వ అధికారులు ఎన్ని సార్లు ఆఫీసుల చుట్టు తిరిగినా ఆ కుటుంబానికి రావల్సిన డబ్బుల తాలుకు చెక్ ఇవ్వలేదు. కాళ్ళ వేళ్ళా పడితే చివరకు ఒక అవినీతి అధికారి 3000 రూపాయలు లంచం ఇస్తే చెక్ ఇస్తానన్నాడు. చనిపోయిన వారికి ఇచ్చే డబ్బులలో కూడా అవినీతికి పాల్పడుతున్న ఆ అధికారికి బుధ్ధి చెప్పాలనుకున్న అజిత్, తన తండ్రి ఫొటొ మరియు అధికారి అడిగిన లంచం విషయాలతో ఓ ఫ్లెక్షి తయారుచేసి బిక్షాటన చేసాడు. ఆ విషయం మీడియా కంట పడి పై అధికారులకు తెలిసి ఆ అవినీతి అధికారిని ఉద్యోగంలోంచి తొలగించారు. వినూత్నంగా అలోచించి లంచగొండి అధికారికి శిక్ష పడెలా చేసిన అజిత్ ను అందరూ అభినందించాల్సిందే.

(Visited 625 times, 1 visits today)