Home / Latest Alajadi / పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులకు పీఏ, పీఎస్ లా? : సుప్రీం

పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులకు పీఏ, పీఎస్ లా? : సుప్రీం

Author:

ఓనమాలు దిద్ధించి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే మార్గదర్శి ఉపాధ్యాయుడు. మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవోభవ… తల్లి, తండ్రిని, విద్య నేర్పే గురువును గౌరవించాలని అంటారు. అంతటి గొప్ప స్థానం బడి పంతులికి ఉంది. బడిలో పిల్లలకు పాఠాలు చెప్పల్సిన పంతులు ప్రజాప్రతినిధులకు వ్యక్తిగత సహాయకులుగా (పీఏ), వ్యక్తిగత కార్యదర్శులుగా ఉండటాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. ఉపాధ్యాయులు ఇకపై ప్రజాప్రతినిధుల వద్ద పీఏ, పీఎస్‌లుగా కొనసాగేందుకు వీల్లేదని అది చట్ట విరుద్ధమని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పాఠశాలల్లో వసతుల లేమి, ఉపాధ్యాయుల కొరతపై దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది.

teachers-return-to-school

ఎలాంటి విధానం దేశంలో ఎక్కడ లేదని ధర్మాసనం పేర్కొన్నది. టీచర్లను వారంలోగా పాఠశాలకు కేటాయించాలని తెలుగు రాష్ట్రాలకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. పాలకుల కింద పీఏ, పీఎస్ లుగా విధులు నిర్వహిస్తున్న వారు అక్టోబర్ 1 నుంచి బడుల్లో చేరాలని కోర్టు సూచించింది. పీఏ, పిఎస్‌లుగా ఈ ఏడాది కొనసాగేందుకు ఉపాధ్యాయులు గడువు కోరగా వారి విజ్ఞప్తిని సుప్రీం తిరస్కరించింది. ఉపాధ్యాయుల పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.

(Visited 145 times, 1 visits today)