Home / Latest Alajadi / తెలంగాణ ఎన్నికల లైవ్ అప్ డేట్స్.!! ఉదయం నుండి ఇప్పటివరకు జరిగింది ఇలా.!

తెలంగాణ ఎన్నికల లైవ్ అప్ డేట్స్.!! ఉదయం నుండి ఇప్పటివరకు జరిగింది ఇలా.!

Author:

డిసెంబర్ 7 న తప్పక ఓటు వేయండి గత కొన్ని రోజులుగా ప్రచారం కి తెరపడింది. ఎన్నికల రోజు రానే వచ్చింది. సెలబ్రిటీస్ కూడా సామాన్య జనంలా క్యూ లో నించొని ఓట్లు వేసి దేశం పట్ల తమ బాధ్యతను చాటుకున్నారు. పోలింగ్ బూత్ ల వద్ద ఎన్నికల జోరు బలంగా నడుస్తుంది. కొన్ని చోట్ల టీఆరెస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. పోలీసులు సజావుగా సాగేలా ప్రయత్నిస్తున్నారు. పోలింగ్ సాగింది ఇలా…లైవ్ అప్డేట్స్ మీకోసం.

ఉదయం 7 :
పోలింగ్ ప్రారంభమైంది. ఆపద్ధర్మ మంత్రి హరీష్‌ రావు, తుమ్మల నాగేశ్వర రావు, ఇంద్ర కరణ్‌ రెడ్డి, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.అయితే ఈవీఎంలో సమస్యలు తలెత్తడం వల్ల కొడంగల్‌లో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది.

ఉదయం 7.30 :
కొన్నిచోట్ల ఈవీఎం లు సరిగా పనిచేయకపోవడంతో పోలింగ్ స్టార్ట్ కాలేదు. దీనిపై ఓటర్లు అసహనం వ్యక్తం చేసారు.

ఉదయం 8 :
పీవీ సింధు, రాజమౌళి ఇప్పటికే ఓటు వేయగా..జూబ్లీహిల్స్‌లో ఓటు వేసేందుకు అల్లు అర్జున్‌, నాగార్జున, అమల క్యూలైన్లో ఎదురుచూస్తున్నారు.

ఉదయం 8.30 :
గంటన్నర అవుతున్నా ఇంకా కొన్ని చోట్ల ఈవీఎం లు సరిగా పనిచేయక పోలింగ్ ప్రారంభం అవ్వలేదు.కిషన్‌ రెడ్డి, అయన కుటుంబ సభ్యులు కాచిగూడలో ఓటు వేశారు.

ఉదయం 9 :
రంగారెడ్డి పుప్పులగూడ బాలాజీ నగర్‌లో బీజేపీ మహాకూటమి నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.సదాశివపేట పట్టణంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింత ప్రభాకర్‌ ఓటు వేశారు. ప్రశాసన్‌ నగర్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి ఓటు వేశారు. కొండారెడ్డిపల్లిలో రేవంత్‌ రెడ్డి, గద్వాలలో డీకే అరుణ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి తన కుటుంబసభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. తెలంగాణలో 9 గంటల వరకు 8.97 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఉదయం 9.30 :
సరైన ఏర్పాట్లు చేయలేదని చాలా కేంద్రాల్లో ఓటర్లు ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా 229 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మోరాయించాయి. 20 కేంద్రాల్లో ఇంకా పోలింగ్‌ ప్రారంభం కాలేదు

ఉదయం 10 :
జూబ్లీహిల్స్‌ ఓబుల్‌రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌లోని పోలింగ్‌ బూత్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులతో పాటూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.గండిపేట్ మండల్ కిస్మాత్ పూర్‌లో శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్‌ అరగంటకు పైగా లైన్‌లో వేచి ఉన్నారు. బోధన్‌లో ఎంపీ కవిత, రాజేంద్ర నగర్‌లో అసదుద్దీన్‌ ఒవైసీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉ.10 గంటల వరకు 10.15 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఉదయం 10.30 :
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో 50% ఓట్లు గల్లంతు అవ్వడంతో రోడ్డు పై గ్రామస్థులు రాస్తా రోకో చేస్తున్నారు.

ఉదయం 11 :
నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలో 18వ బూతులో ఓటు వేసేందుకు వచ్చిన నరసింహ అనే వృద్ధుడు గుండెపోటుతో పడిపోగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు, మాజీ మంత్రి ముకేశ్ గౌడ్, గద్దర్, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రవణ్, విజయశాంతి, నితిన్, డీజీపీ మహేందర్ రెడ్డి, స్వామి పరిపూర్ణానంద, కమెడియన్‌ సునీల్‌, నటుడు నాగేంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణలో ఉ.11 గంటల వరకు 21.97 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఉదయం 11.30 :
కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అరవింద్, మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంచి రెడ్డి కిషన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గణేష్‌ గుప్తా, జీవన్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్‌, బండారు దత్తాత్రేయ, జిట్టా బాలకృష్ణా రెడ్డి, గొంగిడి సునితా మహేందర్‍రెడ్డి, కే లక్ష్మణ్‌, సానియా మీర్జా, మంచు లక్ష్మి, నటుడు రాజేంద్ర ప్రసాద్‌లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మధ్యాహ్నం 12 :
టీఆర్ఎస్ అభ్యర్థులు దాసరి మనోహర్ రెడ్డి, ఏనుగు రవిందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్‌, ఎంపీ బీబీ పాటిల్‌లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మధ్యాహ్నం 12.30 :
చింతమడకలో సీఎం కేసీఆర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హీరో మహేష్‌ బాబు, నమ్రతా శిరోద్కర్, గవర్నర్‌ నరసింహన్‌, కేటీఆర్‌, ఉప్పల్ బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డిలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

source

(Visited 1 times, 25 visits today)