Home / Inspiring Stories / తెలంగాణ ప్రజల నడ్డి విరిచిన ప్రభుత్వం.

తెలంగాణ ప్రజల నడ్డి విరిచిన ప్రభుత్వం.

Author:

ఆర్టీసీ ఇలాగే ఉంటే మూసేస్తా, తీరు మార్చుకోవాలి, లాభాలు వచ్చేటట్లుగా పని చేయాలని కేసీఆర్ అనగానే ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయని అందరూ అనుకున్నారు, కానీ ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు మరోసారి సామాన్య ప్రజలపై భారం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది, ఈ నెల 27 వ తేదీ నుండి పెంచిన చార్జీలు అమలులోకి వచ్చేట్లుగా ఉత్తర్వులను జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం, కూరగాయల ధరలు, నిత్యావసరాల ధరలు, డీజిల్, పెట్రోల్ రేట్లు ఇప్పటికే పెరిగిపోవడంతో ఇప్పుడు ఆర్టీసీ రేట్లు కూడా పెరిగిపోవడంతో తెలంగాణ ప్రజల పై మరింత భారం పెరిగిపోయింది.

RTC bus fare

ప్రజలపై భారం మోపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని… ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి బయటకు తీసుకవచ్చేందుకే స్వల్పంగా చార్జిలను పెంచినట్లు, ఆర్టీసీని ఎంత కష్టమైనా ప్రభుత్వమే నడుపుతుందని.. ఎట్టి పరిస్థితిలో ప్రైవేట్ పరం చేసేది లేదని. ఆర్టీసీకి రోజుకు రెండుకోట్ల నష్టం వస్తుందని…ఇప్పుడు చార్జీలు పెంచడం వల్ల 286 కోట్లు సమకూరుతాయని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు.

తాజాగా పెరిగిన చార్జీల ప్రకారం:

    • ఎక్స్ప్రెస్, ఆపై సర్వీసులకు 10శాతం ఛార్జీల పెంపు
    • సిటీ సర్వీసుల్లోనూ 10 శాతం
    • పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలోమీటర్ల వరకూ ఒక రూపాయి పెంపు
    • ఆపై స్టేజ్కి పల్లె వెలుగు బస్సుల్లో 2 రూపాయిలు పెంపు
    • ఎక్స్ప్రెస్ ఛార్జీ కిలోమీటర్కు 79 పైసల నుంచి 87 పైసలకు పెంపు
    • డీలక్స్ ఛార్జీ కి.మీ.కు 89 నుంచి 98 పైసలకు పెంపు
    • సూపర్ లగ్జరీ ఛార్జీ కి.మీ.కు రూ.1.05 పైసల నుంచి రూ. 1.46 పైసలకు పెంపు
    • ఇంద్ర ఛార్జీ కి.మీ.కు రూ. 1.32 పైసల నుంచి రూ. 1.46 పైసలకు పెంపు
    • గరుడ ఛార్జీ కి.మీ.కు రూ. 1.55 పైసల నుంచి రూ.1.71 పైసలకు పెంపు

(Visited 945 times, 1 visits today)