తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరో శుభవార్త. ఇప్పటికే కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన పోలీస్‌శాఖ తాజాగా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపింది. పోలీస్ శాఖలోని ఆయా విభాగాలలో ఖాళీగా ఉన్న 510 ఎస్ఐ పోస్టులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది.
సివిల్ విభాగంలో 208, ఏఆర్ విభాగంలో 74, టీఎస్ఎస్పీ విభాగంలో 205, ఎస్పీఎఫ్ విభాగంలో 12, ఎస్ఏఆర్ సీపీఎల్ విభాగంలో 2, 9 స్టేషన్ ఫైర్ ఆఫీసర్లకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఇక పీటీవో, కమ్యూనికేషన్ విభాగంలో 29 పోస్టులకు కూడా నోటిఫికేషన్ జారీ అయింది.
మొత్తంగా 539 పోస్టులకు దరఖాస్తులను ఈ నెల 10 నుంచి మార్చి 3వ తేదీ వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నారు.దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులు www.tslprb.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Useful Link: Complete Notification