Home / Political / తెలంగాణలో మాత్రమే తగ్గనున్న మొబైల్ ఫోన్ల ధరలు.

తెలంగాణలో మాత్రమే తగ్గనున్న మొబైల్ ఫోన్ల ధరలు.

Author:

డిజిటల్ రంగంలో దూసుకుపోవడానికి ప్రజలకు సహకరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్ల కొనుగోలుపై వేసే వ్యాట్( వాల్యూ యాడెడ్ ట్యాక్స్) ను 14.5% నుండి 5% కు తగ్గించింది. బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బిల్ కి తెలంగాణ శాసనసభ అమోద ముద్రవేసింది. దానితో మొబైల్ ఫొన్ల ధరలు ఇంతకుముందు ఉన్న ధర కన్న 9.5% తగ్గనున్నాయి. కొత్త టెక్నాలజీ ని అందిపుచ్చుకొని అందరూ డిజిటల్ గా ముందుకు పోవలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

decrease-10-parcent-of-the-prices-of-mobile-phones-in-telangana

నోట్ల రద్దు తర్వాత డిజిటల్ బ్యాంకింగ్ మరియు క్యాష్ లెస్ ట్రాన్జాక్ష‌న్ వాడాలని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు చెబుతున్నాయి, కాని వాటిని వాడాలంటే ప్రజలందరికి స్మార్ట్ ఫోన్ మరియు ఇంటర్నెట్ సదుపాయాలు ఉండాలి. కాని అవి ప్రజలకు అందుబాటులోకి తేకుండా ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా అది వృదా ప్రయాసే. కాని ఫోన్ల ధరలు తగ్గించి వాటిని సామాన్యులకు మరింత దగ్గర చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న చర్యను మనం అందరం అభినంధించాల్సిందే

(Visited 595 times, 1 visits today)