Home / Inspiring Stories / టీటీడీపి సారథి రేవంత్ రెడ్డి..?

టీటీడీపి సారథి రేవంత్ రెడ్డి..?

Author:

టీ.టీడీపీ పగ్గాల వ్యవహారం ఊహించిన మలుపు తిరుగుతున్నట్టే ఉంది. ఎప్పటి నుంచో ఈ విశయమై ఆ పార్టీ నేతల కసరత్తు కొన సాగుతూనే ఉంది.ఐతే ఆ మద్య తెలుగు దేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారం లో ఇరుక్కోవటంతో తెలంగాణా టీడీపీలో కాస్త గందరగోళం నెలకొంది. తాజాగా వెలువడిన వార్తలౌ ఇక ఈ తర్జనభర్జనలకు పుల్ స్టాప్ పెట్టేలానే ఉన్నాయి. తెలంగాణ లో వివాదాస్పదుదైన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. నేరుగా విజయవాడకు వెళ్లిన రేవంత్ రెడ్డి మరికొందరు తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి చంద్రబాబును కలిసి చర్చలు జరిపారు.

ఓటుకు నోటు కేసు విషయం లో రేవంత్ రెడ్డి మొదట కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది తర్వాత బెయిల్ సడలించారు.దీంతో రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడికైనా వెళ్లే అనుమతి లభించినట్టయింది.  రేవంత్ కు వెసులుబాటు రావటం తో ఆయన ఈరోజు చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర టిడిపి బాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో చంద్రబాబుతో భేటీ ప్రాధాన్యాన్న సంతరించుకుంది. తెలంగాణలో టీ టీడీపీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగిస్తారనే ఊహాగానాలు కూడా ఊపందుకుంటున్న నేపథ్యంలో కూడా వారి సమావేశం చర్చనీయాంశం అయింది.ఎప్పటినుంచో ఇది అంతా ఊహించిందే అయినా.. మిగిలిన
నేతలు ఈ విశయం లో ఎలా స్పందిస్తారన్నది ఇంకా అనుమానం గానే ఉంది. ఇదివరకే రేవంత్ విషయ్మ్ లో సీనియర్లంతా కాస్త కినుక గానే ఉన్నారన్న వార్తలు వచ్చాయ్.ఎర్రబెల్లి ఈ సారి టీటీడీపీ పగ్గాలు తనచేతిలోకే రావటం ఖాయం అనంట్టుగానే ఉన్నారు ఐతే ఓటుకు నోటు వ్య్వహారం వల్ల కీలక మార్పులు జరిగాయి. అయితే ఇక్కడ ముందు నుంచి ఉన్న సీనియర్ నేతలతో బాబు సంప్రదిస్తారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.

తెలుగుదేశం జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతున్న క్రమంలో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా యువనేత , ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ ను నియమించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయ్ కూడా. ఇప్పటికే పలువురు నాయకులు ఈ రకమైన డిమాండ్లు చేశారు. దానికి అనుగుణంగానే లోకేష్ కు ప్రమోషన్ రావచ్చు అనే వారతలు వినిపిస్తున్నాయి. పార్టీలో ఇప్పటికే కీలకమైన వ్యక్తిగా యువనేత గా లోకేష్  ఎదిగారు. ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లాకు చెందిన ఎల్ రమణ కొనసాగుతున్నారు ఐతే ఆయనను తొలగంచకుండా ఆయనను ఆ పదవిలో కొనసాగిస్తూనే రేవంత్ రెడ్డికి ప్రధాన బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు.

(Visited 344 times, 1 visits today)