Home / Inspiring Stories / మన తెలుగమ్మాయి ఒలింపిక్స్‌ పతకం తెస్తుందా?

మన తెలుగమ్మాయి ఒలింపిక్స్‌ పతకం తెస్తుందా?

Author:

రియో ఒలింపిక్స్ లో భారత దేశ పతక ఆశలు సన్నగిల్లుతున్న వేళ మహిళల బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్‌, మన తెలుగమ్మాయి పీవీ సింధు సెమీస్‌కు చేరింది. ఎన్నో అంచనాలతో భరిలోకి దిగిన సైనా నెహ్వాల్ మొదటి రౌండ్ లోనే నిరుత్సాహపరచడంతో సింధు మీద భారం పెరిగింది. ఆ అంచనాలకు తగ్గట్లుగానే సింధు కూడ ఒక్కొక్క విజయాన్ని నమోదు చేసుకుంటు క్వార్టర్ ఫైనల్ లో లండన్‌ ఒలింపిక్స్ రజత పతక విజేత, ప్రపంచ నెం.2 షట్లర్‌ వాంగ్‌ యిహన్‌(చైనా)పై 22-20, 21-19 తేడాతో వరుస సెట్లలో గెలుపొందింది.

PV-SINDHU-Storms-into-the-semis-RIO-OLYMPICS-2016

తొలి సెట్‌లో కొంత వెనుకంజలో ఉన్న సింధు వరుసగా పాయింట్లు సాధించి మొదటి సెట్ ని కైవసం చేసుకుంది. రెండో సెట్‌లో మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగిన సింధు రెండవ సెట్ ని సులభంగానే గెలిచి మ్యాచ్ ను కైవసం చేసుకుంది. గురువారం జరిగే సెమీస్‌ మ్యాచ్లో సింధు జపాన్‌కు చెందిన షట్లర్‌ నొజొమి తో తలపడనుంది. ఈ సంధర్భంగా మనమందరం సింధు గెలుపు కోరుకుందాం.

(Visited 56 times, 1 visits today)