Home / Entertainment / అజిత్ స్టైలే వేరబ్బా…!

అజిత్ స్టైలే వేరబ్బా…!

Author:

నిన్ననే జరిగిన తమిళనాడు ఎన్నికల్లో దాదాపుగా సినీప్రముఖులు అంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరిలాగే తన ఓటు హక్కు వినియోగించుకున్న అజిత్ ఆ తర్వాత తన చేతివెలిని మీడియాకు చూపించే క్రమంలో చాకచక్యంగా అనటం కంటే తనదైన రీతిలో వ్యవహరించాడని చెప్పొచ్చు, మామూలుగా ఎలక్షన్లప్పుడు చూపుడు వేలికి వుండాల్సిన ఇంకు గుర్తుని అజిత్ మధ్య వేలికి వేయించుకున్నాడు. ఆ తర్వాత కేవలం మిడిల్ ఫింగర్‌ని మాత్రమే మీడియాకు చూపిస్తే అది కాంట్రవర్శీ అయ్యే అవకాశం వుందనుకున్నాడో ఏమో తెలీదు కానీ ఓటేసిన అనంతరం బయటికొస్తూ చేతివేళ్లన్నింటినీ ఎత్తి తానూ ఓటేశాననే సంకేతం ఇచ్చాడు. అజిత్ అసలు ఈ విషయం కాకపోయినా మొదటి నుంచీ అన్ని విషయాలలో జాగ్రత్తగానే వ్యవహరించేవాడు. తన ఫాన్స్ కూడా అజిత్ గురించి గొప్పలు చెప్పుకుంటూ తెగ ఆనంద పడుతూ ఉంటారు. అజిత్ కూడా అందుకు తగ్గట్టుగానే డౌన్ టూ ఎర్త్ లానే ఉంటాడు. ఏమైనా అజిత్ లా, ఉండాలంటే అప్పటికప్పుడు నేర్చుకునేది కాదు, అది పుట్టుకతోనే ఉండాలి అని విజయ్ ఫాన్స్ మీద అప్పుడప్పుడూ చురకలు వేస్తూనే ఉంటారు అజిత్ ఫాన్స్ .

Ajith Vote

ఇది అలా ఉండగా
2013 ఎన్నికల్లో బాలీవుడ్‌లో బడా స్టార్స్‌గా పేరున్న కొంతమంది సినీప్రముఖులు ఎలక్షన్ల సమయంలో ఇలానే ఇంకుని మధ్య వేలికి వేయించుకుని అదే వేలిని మీడియాకు చూపించడం అప్పట్లో కాస్తంత దుమారం రేపి కాంట్రవర్శీ అయ్యి సోషల్ మీడియాలో కూడా బాగానే హల చల్ చేసింది . బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ప్రముఖ దర్శకనిర్మాత యాశ్ చోప్రా, నటులు అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం, రాహుల్ బోస్ వంటివాళ్లు కూడా అప్పట్లో ఈ మిడిల్ ఫింగర్ కాంట్రవర్శీలో వున్నారు. అయితే, అదే సమయంలో అలాగే మధ్యవేలికి ఇంకు పెట్టించుకున్న షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సోనమ్ కపూర్ లాంటి వాళ్లు మాత్రం తెలివిగా చేతి వేళ్ళు అన్నింటినీ చూపిస్తూ వెళ్లిపోయారు. ఇప్పుడు అజిత్ వ్యవహరించిన తీరు మళ్లీ 2013 ఎన్నికల మన బాలీవుడ్ నటుల తతంగాన్ని గుర్తుకు తెచ్చింది.

Middle Finger Vote

(Visited 250 times, 1 visits today)