Home / Entertainment / తనయుడి తో పూరీ కొత్తసినిమా ?

తనయుడి తో పూరీ కొత్తసినిమా ?

Author:

కథల బ్యాంక్ అని సన్నిహితులు ముద్దుగా పిలుచుకునే స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి హీరో మేకర్ అనే ఇంకో పేరు కూడా ఉంది. రవితేజా లాంటి మాస్ మహారజాని  ఇడియట్ తో బయటికి తెచ్చిన పూరీ అప్పటి దాకా సాఫ్ట్ హీరో గా ఉండి యాక్షన్ హీరో గా మారాలనుకుంటున్న టైం లో మహేష్ కి పోకిరీ తో సరైన బూస్ట్ ఇచ్చారు. హీరో కి సరిగ్గా సరి పోయే విధంగా కథని మార్చుకొని ఆయా పాత్రలని హైలేట్ చేయటం లో తన మార్క్ చూపించే ఈ డైనమిక్ డైరెక్టర్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న గుర్తింపేంటో అందరికీ తెలుసు. తానే హీరో లా కనిపించే ఈ డైరెక్టర్ నిజంగానే సినిమాకి తెర వెనుక హీరో అనే పేరూ.

ఐతే స్వతహాగా నటన మీద మంచి పట్టు ఉన్న పూరీ తన తమ్ముడు సాయి రాం శంకర్ని హీరో గా నిలబెట్టాలని చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసిన 143 సినిమాతోనే మాస్ హీరోగా ఎదుగుతున్నాడనుకున్న సాయిరాం శంకర్ అక్కడే ఆగిపోయాడు. ఆ తర్వాత ఇంకా కొన్ని ప్రయత్నలు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు పూరీ మరో సారి తన చిరకాల వాంచని తన కొడుకు ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నాడట. ఇప్పటికే బాలనటుడిగా ధోనీలో నటించి ప్రశంసలందుకున్న ఆకాశ్ పూరీ. యువ హీరో గా చేసిన లవ్ స్టోరీ ఆంద్రా పోరీ ధారుణం గా బోల్తాపడటం తో. ఆకాశ్, పూరీ ఇద్దరూ మరో ప్రయత్నం తో తమని తాము నిరూపించుకోవాలనే కసి మీద ఉన్నారు. ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ ఐపోగానే ఆకాశ్ తో కొత్త సినిమా మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. కొన్ని కథలు చూసాక తానే ఇంకో కథ రెడీ చేస్తున్నట్టు సమాచారం.

ఈ సినిమాలో ఆకాశ్ ఒక పోలీస్ ఆఫీసర్ గా గానీ లేదా యువ పొలిటీషియన్ గా గానీ కనిపిస్తారట. రాజకీయాలలో తాను కోరుకున్నమార్పునీ,  ప్రస్తుత రాజకీయ పార్టీల్లోని లోపాలనీ ఎత్తి చూపే విధంగా ప్లాన్ చేస్తూనే తనదైన తీరు లో ప్రజల నిర్లక్ష్యం మీద కూడా బాణాలు వదిలే లా మాటలు రాస్తున్నారట  బాలీవుడ్లోనూ, టాలీ వుడ్ లోనూ ఆకాశ్ కి జోడీగా ఉండే హీరోయిన్లు దొరకక పోవటం తో ఈ సారి కొత్త అమ్మాయిని పరిచయం చేయబోతున్నారు. ఐతే ఆ కొత్తమ్మాయి ఏ నార్తిండియనో కాకుండా తెలుగు అమ్మాయినే సెలక్ట్ చేస్కోవాలనుకుంటున్నారట పూరీ. కథలో సరిపోయే విధంగా తన బాడీని మార్చుకోవటానికి జిం లో గడుపుతున్నాడట ఆకాశ్.

బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ శరీరాకృతి మార్చుకునే పనిలో పడ్డాడట. తాను హీరో గా కాకుండా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకునే దిశగానే ఆలోచిస్తున్నా అని  ఇదివరలో చేప్పిన ఆకాశ్ అదే మాట పై నిలబడుతూ నటనలో మరిన్ని మెళకువల కోసం తరచూ ప్రకాశ్ రాజ్ ని కలుస్తున్నాడట. తండ్రీ కొడుల కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎలా ఉండబోతుందో చూడాలంటే మాత్రం 2017 వరకూ ఆగాల్సిందే.

(Visited 78 times, 1 visits today)