షార్ట్ ఫిల్మ్ మేకర్ కం జర్నలిస్ట్ ఐన అజహర్ షేక్ కి చుట్టు ఉన్న పరిసరాలని తన కెమెరా తో బంధించడం చాల ఇష్టం. అలా ఒకరోజు షాద్ నగర్ పెద్ద కుంట లొ ఆయన తీసిన ఫొటొ స్రవంతి అనే బాలిక జీవితాన్ని మార్చేసింది…
స్రవంతి.. షాద్ నగర్ పెద్దకుంట గిరిజన తండా లో ఒక ప్రభుత్వ పాఠసాలలొ 5 వ తరగతి చదువుకుంటున్న సాధరణ బాలిక. తన భవిషత్ ఎంతొ గొప్పగాఉండలని తన తల్లిదండ్రులని బాగా చూసుకోవాలని కలలుకనేది. కానీ తన తండ్రి సేవ్య రొడ్డు మరణంతో వారి జీవితం వీధిపాలైంది. స్రవంతి తల్లి తులసి తప్పనిసరి పరిస్తితుల్లొ తన చిన్నరి భవిషత్తు కోసం కుతుంబ బాధ్యత మోసింది . అరకొర డబ్బులతొ కుతుంబ పొషణ కష్టంగా ఉన్న పరిస్థితులలో స్రవంతికి అనరొగ్యం కారణంగా చెవిలొ చీము కారదం మొదలయ్యింది, ఇ ఎన్ టి హాస్పిటల్ లో చుపించారు, కానీ వాళ్ళు ఇచిన మందులు వాదుతున్నంతకాలం బాగానే ఉండేది, వాదటం ఆపేస్తే సమస్య మరల మొదటికి వచ్చేది. ఒక షార్త్ ఫిల్మ్ షూటింగ్లొ భాగంగా అజహర్ స్రవంతి ఫోటో తీయడం జరిగింది. ఆమెలొని అమయకత్వం, చిరునవ్వు, పట్టుదల ఆయన్ని ఆశ్చర్యపరిచింది.
ఫిబ్రవరి 2,3,4 తేదీలలో రవీంద్ర భారతి లో జరిగిన “తెలంగాణ బ్రతుకు చిత్రం” ఫోటో ఎగ్జిబిషన్ లో స్రవంతి ఫోటో ప్రముఖ వ్యాపరవేత్త రాజేంద్రప్రసాద్ ఎలవర్తి ని ఆకర్షించిది. ఆ ఫోటో తీసిన అజహర్ షేక్ ద్వార ఆమె విషయం తెలుసుకున్నరు. తనకు తోచిన సహయం చెస్తానని మాట ఇవ్వడంతో పాటూ అవసరమైతే తనని దత్తత తీసుకొని తన భవిషత్ కి బంగరుబాట వెస్తానని మంచి వైద్యం అందిస్తానని అన్నరు. స్రవంతి ఫోటో ఎంతొమందికి స్పూర్తిని నింపింది. ఆమె ఫోటో తొ చాలమంది సెల్ఫి తీసుకొని, తమవంతు సహకారం అందిచడానికి ముందుకు వచ్చారు. దాతల సహకరంతొ ఇప్పుడు స్రవంతి బాగ చదువుకొని తను కన్న కలలు సాకారం చెసుకొనే ప్రయత్నంలొ ఉంది. చూసరా స్రవంతి ఫోటో ఎలా తన తలరాతను మర్చేసిందో !!!
తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.