Home / health / ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఈ మిశ్రమాన్ని తాగితే ఎముకలు బలంగా అవుతాయి..!

ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఈ మిశ్రమాన్ని తాగితే ఎముకలు బలంగా అవుతాయి..!

Author:

మనవ శరీరంలో ప్రతి భాగం ఎముకతో ముడిపడి ఉంటుంది. ఇది అందరికి తెలిసిన విషయం. ఒక మనిషి తన ఎదుగుదలలో 30 సంవత్సరాల వరకు ఎముకల ఎదుగుదల ఉంటుంది. ఆ తరువాత ఎముక పెరగటం ఆగిపోతుంది. మన శరీరంలో పాత ఎముకలు పాడైన కొద్ది కొత్త ఎముకలు వస్తుంటాయి. అలాగే వయస్సు పెరుగుతున్న కొద్దీ, ఎముకలు చాలా బలహీనపడుతుంటాయి. అందులో ఆడవారికి ఎక్కువగా ఈ సమస్య జరుగుతుంటుంది. సరైన ఆహారపు అలవాట్లు లేకపోయినా ఎముకలు దెబ్బతింటాయి. ఎప్పుడైతే ఎముకలు బలహీన పడటం ప్రారంభిస్తాయో అప్పటి నుంచి ఇక ఏ పని చేయలేరు. అందుకే తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. వీటన్నింటికీ పరిష్కారంగా వైద్య నిపుణులు ఎముకల బలాన్ని పెంచుకొనేందుకు ఒక పద్దతిని మనకు ఒక డ్రింక్ పద్దతిలో తెలియజేస్తున్నారు. ఈ డ్రింక్ ని వరుసగా 15 రోజులపాటు తీసుకొంటే ఎముకలు ఉక్కు లాగా గట్టిపడతాయని చెపుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

డ్రింక్ తయారీకి కావలసినవి:

  • తేనె 2 టేబుల్ స్పూన్లు
  • నువ్వులు 1 టేబుల్ స్పూన్
  • గుమ్మడి విత్తనాలు అర టేబుల్ స్పూన్

these-drink-will-helps-to-strengthen-your-bones

ఇలా చేయాలి:
తేనె, నువ్వులు, గుమ్మడి విత్తనాలను సరైన మొతాదులో తీసికొని గ్రైండ్ చేసుకోవాలి.ఓ కప్పు వేడిపాలలో ఈ మిశ్రమాన్ని కలపాలి. ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఈ మిశ్రమాన్ని తాగాలి.

ఈ మిశ్రమంలో కాల్షియం అధికంగా ఉంటుంది. విటమిన్ డి, ఇతర మినరల్స్ అధికంగా శరీరానికి అందుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఇన్ ఫెక్షన్లు, ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి.ఒక్క సారి మీరు ఈ పద్దతిలో తయారు అయిన డ్రింక్ ని తాగి చూడండి మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లో ఉంచుకోండి.

Must Read: Video: జింజర్ వాటర్ తాగి సులభంగా బరువు తగ్గించేసుకోవచ్చు.

(Visited 1 times, 1 visits today)