Home / health / నిద్ర రావట్లేదా? అయితే ఈ పదార్ధాలు ఎక్కువగా తినండి.

నిద్ర రావట్లేదా? అయితే ఈ పదార్ధాలు ఎక్కువగా తినండి.

Author:

కొందరు కళ్ళు మూసుకొని పడుకోవటమే ఆలస్యం వెంటనే నిద్రలోకి జారుకుంటారు. కొందరికి మాత్రం పక్కంతా దొర్లినా నిద్రే పట్టదు. ఏం చేసినా.. ఎంత ప్రయత్నం చేసినా నిద్రే పట్టదు. అలాంటి వారి కోసమే ఈ స్పెషల్ న్యూస్.

good sleep with food

నిద్ర సుఖమెరుగదు అంటారు నిజమే.. కొందరు తినగానే ఒక 5 నిమిషాలు పడుకోనా అని హాయిగా నిద్ర పోతారు. చాలామందికి తినగానే ఓ 5 నిముషాలన్నా కునుకు తీయాలనిపిస్తుంది. దీనికి కారణం కొన్ని ఆహార పదార్థాల్లో మత్తుగా నిద్రపుచ్చే గుణాల విటమిన్లు ఉంటాయట. మరి అసలే నిద్ర పట్టని వాళ్ళు ఈ ఆహార పదార్థాలు తింటే కచ్చితంగా నిద్ర రావాల్సిందే అంటున్నారు డాక్టర్లు.

చేపలు, బీన్స్, పెరుగు, ఆకుకూరలను తినడం ద్వారా మంచి నిద్ర వస్తుందని న్యూట్రీషన్లు చెబుతున్నారు. బీన్స్, బఠానీ, చిక్కుడు కాయల్లో బి6, బి12 విటమిన్లతో పాటూ ఫోలిక్ ఆసిడ్స్ ఉంటాయి. ఈ బి విటమినే మనకు మంచిగా నిద్రొచ్చేలా పనిచేస్తుందట. ఆకుకూరల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా నిద్రలోకి జారడానికి మందులా పనిచేస్తోంది. అలాగే ఫాట్‌లెస్ పెరుగులో కూడా కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. పెరుగులోని కాల్షియం, మెగ్నీషియంల ప్రభావంతో అత్యంత వేగంగా నిద్రలోకి జారుకుంటారని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి నిద్రలేమితో ఇబ్బంది పడుతున్న వారు బి విటమిన్ ఉన్న పదార్థాలు, రెండు రోజులకోసారి ఆకుకూరలు తీసుకోవడంతో పాటూ పెరుగు తినడం ద్వారా నిద్ర లేమిని దూరం చేసుకోవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. కాబట్టి ఇక నిద్ర పట్టడంలేదని దిగులు చెందకండి. ఒకసారి ఇవి ప్రయత్నించి చూడండి. ఆనందంగా ఓ కునుకు తీసేయండి.

(Visited 3,130 times, 1 visits today)