Home / health / ఇలా 3 రోజుల పాటు చేస్తే ఖచ్చితంగా మీ శరీరంలో మార్పు వస్తుంది.

ఇలా 3 రోజుల పాటు చేస్తే ఖచ్చితంగా మీ శరీరంలో మార్పు వస్తుంది.

Author:

మన శరీరం ఎంత ఫిట్ గా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉన్నట్టు, ఈ మధ్య చాలా మంది అధిక బరువు వల్ల అనేక ఆనారోగ్యాలకి గురవుతున్నారు, అధిక బరువు ఉండటం వల్ల శరీరంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది, దాని వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు, డయాబెటిస్, బిపి లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ఆవకాశం ఉంది,ముఖ్యంగా పొట్ట దగ్గరే ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది,కొవ్వు అలా పేరుకుపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం జంక్‌ఫుడ్‌, కార్బొహైడ్రేట్లు, చ‌క్కెర‌తో త‌యారు చేసిన ప‌దార్థాల‌ను అధికంగా తిన‌డ‌మే. దీంతో శ‌రీరంలో విష ప‌దార్థాలు కూడా పేరుకుపోతాయి.

ఈ మధ్య కాలంలో చాలా మంది వివిధ మార్గాల ద్వారా అధికంగా పేరుకుపోయిన కొవ్వుని తగ్గించుకోవడం కోసం చాలా కష్టపడుతున్నారు, కానీ ఎక్కువ మంది కెమికల్స్ తో తయారు చేసిన మందులనే వాడుతున్నారు, వాటిని వాడటం వల్ల కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి, అయితే ఈ విష ప‌దార్థాల‌నే కాదు, కొవ్వును కూడా మ‌నం కేవ‌లం 3 రోజుల్లోనే త‌గ్గించుకోవ‌చ్చు. అదెలాగంటే…

this-3-days-diet-tip-can-be-beneficial

  • మన శరీరంలో అధికంగా కొవ్వు, విష పదార్థాలు పేరుకోపోవడానికి ముఖ్య కారణం చక్కెరతో తయారుచేసిన పదార్థాలని ఎక్కువగా తినడమే, చక్కెర శాతం ఎక్కువగా ఉన్న పదార్థాలని దూరం పెట్టాలి,పిండి ప‌దార్థాలు ఎక్కువ‌గా ఉండే అన్నం వంటి ఆహార ప‌దార్థాల‌ను మరియు జంక్ ఫుడ్‌ను అస్స‌లు తీసుకోవ‌ద్దు,3 రోజుల పాటు కింద చెప్పిన విధంగా ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవాలి.
  • ఉద‌యం ఓట్స్‌తో బాదం ప‌ప్పు లేదా బెర్రీలు, స్క్రాంబుల్డ్ ఎగ్స్‌ను తీసుకోవాలి. 2, 3 గుడ్లను ప‌గ‌ల‌గొట్టి అందులో పాలు, ఉప్పు, మిరియాల పొడి క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని క‌డాయ్‌లో వేసి వేడి చేయాలి. దీంతో స్క్రాంబుల్డ్ ఎగ్స్ త‌యారైపోతుంది.
  • ఉద‌యం అల్పాహారం త‌రువాత మ‌ధ్యాహ్నం భోజ‌నానికి ముందు ఒక క‌ప్పు న‌ట్స్‌ను స్నాక్స్‌గా తీసుకోవాలి.
    మ‌ధ్యాహ్నం భోజ‌నంలో ఉడికించిన ఎర్ర ముల్లంగి దుంప (తుర్నిప్స్‌), క్యారెట్స్‌, బీట్‌రూట్‌, బీన్స్‌, బాదం ప‌ప్పు, చికెన్ బ్రెస్ట్‌ వంటి వాటిని తీసుకోవాలి.
  • రాత్రి భోజ‌నంలో చేప‌ల‌తో బీన్స్‌, పుట్ట గొడుగులు, బ్ర‌కోలి వంటి వాటిని తినాలి.

ఇలా 3 రోజుల పాటు చేస్తే ఖచ్చితంగా మీ శరీరంలో మార్పు వస్తుంది, దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు కూడా ఉండవు.

Must Read: Video: పడుకున్న ఒక నిమిషంలోనే నిద్రలోకి జారుకునే ట్రిక్..!

(Visited 1 times, 1 visits today)