Home / Inspiring Stories / పొరిగింటి రెండేళ్ల చిన్నారి కోసం…చనిపోతూ ఈ తాత ఇచ్చిన విలువైన బహుమతి ఏంటో తెలుసా..?

పొరిగింటి రెండేళ్ల చిన్నారి కోసం…చనిపోతూ ఈ తాత ఇచ్చిన విలువైన బహుమతి ఏంటో తెలుసా..?

Author:

క్రిస్మస్‌ వచ్చిందంటే కానుకల కాలం వచ్చినట్టే. శాంటాక్లాస్‌ అనే గ్రీకు బిషప్‌ 4వ శతాబ్దంలో ఏ ముహూర్తాన ఈ కానుకల పర్వం మొదలెట్టాడోగాని అప్పటి నుంచి ఇప్పటి వరకు అది అప్రతిహతంగా సాగిపోతూనే ఉంది. ‘అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండే పిల్లలకు మాత్రమే’ వాస్తవానికి ఈ బహుమతులు అందాలని క్రిస్మస్‌ తాత మొదట అనుకున్నాడు. అలా చెప్పడం వల్ల పిల్లలు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండి, ఆ కానుకల కోసం ఎదురు చూడటంలో ఒక ఉత్సుకత ఉండేది. కాని అల్లరి చేయని పిల్లలు ఎవరు? బుద్ధి ఉండని పిల్లలు ఎవరు? అసలు పిల్లలంటే మంచి పిల్లలు అని కదా అర్థం. అందుకే శాంటా క్లాస్‌ అందరికీ బహుమతులు ఇచ్చేవాడు. ఆయన పేరు చెప్పి పిల్లలున్న తల్లితండ్రులు తమ పిల్లల దిండ్ల కింద డిసెంబర్‌ 24 రాత్రి, లేదంటే 25 తెల్లవారుజామున కానుకలు ఉంచేవారు.

కానీ ఓ పెద్దాయన మాత్రం తన పొరిగింటిలో ఉండే ఓ రెండేళ్ల చిన్నారి కోసం 14 ఏళ్లకు సరిపడ బహుమతులు కొని ఇచ్చాడు. చనిపోతునాన్ను అని తెలిసి ఒక్కో క్రిస్మస్‌ వేడుకకు ఒక్కో గిఫ్ట్ ఇవ్వాలని భావించాడు. అలా ఆ చిన్నారి 16 ఏళ్లు వచ్చేసరికి అన్ని గిఫ్ట్‌లు పాపకు అందాలని రాశాడు. వివరాలలోకి వెళ్తే.

యూకేలోని గ్లామర్గాన్‌లో నివాసం ఉండే 87 ఏళ్ల కెన్ వాట్సన్ ఈ ఏడాది అక్టోబర్‌లో మృతి చెందాడు. అయితే తను బతికున్న చివరి రోజు వరకు తనకు ఎంతో ఇష్టమైన పొరిగింటిలో ఉంటున్న రెండేళ్ల క్యాడి అనే పాపతోనే సమయం గడిపాడు. తను త్వరలో మృతి చెందబోతున్నానని తెలిసి పాపతో తన జ్ఞాపకాలు పదిలంగా ఉండాలని భావించి ఆమెకు 14 ఏళ్లపాటు వచ్చే క్రిస్మస్ కానుకలు ముందే కొని తన దగ్గర ఉంచుకున్నాడు.

తను మృతి చెందిన తర్వాత ఒకరోజు ఆయన గదికి తన కూతురు వెళ్లి చూడగా క్రిస్మస్ కానుకలు కనిపించాయి. అవన్నీ చిన్నారి క్యాడి కోసం అని మరో లేఖ రాసి ఉండటంతో కెన్ వాట్సన్ కూతురు జెన్నీ అవి ఇచ్చేందుకు ఒక బస్తాలో ప్యాక్ చేసుకుని క్యాడీ ఇంటికి వెళ్లి ఇవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది. 14 ఏళ్ల పాటు పెద్దాయన గిఫ్ట్స్ పంపడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

source

(Visited 1 times, 1 visits today)