Home / Inspiring Stories / తమ పెళ్లిని మాములుగా చేసుకొని, ఆ ఖర్చును ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకిచ్చిన కొత్త జంట.

తమ పెళ్లిని మాములుగా చేసుకొని, ఆ ఖర్చును ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకిచ్చిన కొత్త జంట.

Author:

ఈ రోజుల్లో పెళ్లి అంటే కనీసం 5 లక్షలు అయిన ఖర్చు పెట్టాల్సిందే, ఇక బాగా డబ్బు ఉన్నోళ్ల సంగతి చెప్పక్కర్లేదు, వారు బట్టలకి, డెకరేషన్ కి చేసే ఖర్చుతో చాలా కుటుంబాలు బాగుపడతాయి, మనం పెళ్లికి చేసే ఖర్చులో కొంత పేదవారికి ఖర్చు చేస్తే వారి జీవితాలు బాగుపడతాయి, కానీ మనం ఆ దిశగా ఎప్పుడు ఆలోచించం, కానీ ఒక యువ జంట మాత్రం తమ పెళ్లితో చాలా కుటుంబాలలో వెలుగులు నింపారు.

Inspiring-Couple

ఇండియన్ సివిల్ సర్వీస్ కు ఎంపికైన అభర్, IDBI బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్న ప్రీతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగ సాధన కోసం… వీరిద్దరూ ఓ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకుంటున్న సమయంలో ఒకరిపై ఒకరు ప్రేమని పెంచుకున్నారు. ఆ ప్రేమే క్రమంగా పెళ్లికి దారితీసింది, అయితే తమ వివాహాన్ని అందరిలాగా హంగు, ఆర్భాటాలతో కాకుండా మాములుగా చేసుకోవాలని అనుకున్నారు, తమ పెళ్లి ఖర్చుల కోసం దాచుకున్న డబ్బును ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇవ్వాలనుకున్నారు, ఒక పది రైతు కుటుంబాలని గుర్తించి ఒక్కో కుటుంబానికి 20 వేల చొప్పున 2 లక్షలు అందించారు, ఇంకా నాగ్ పూర్ లోని కొన్ని గ్రంథాలయాలకి చాలా విలువైన పుస్తకాలని కొని విరాళంగా ఇచ్చారు.

ఎంతో సాదాసీదాగా పెళ్లి చేసుకొని,పెళ్లికి వచ్చిన అతిథులకు సింపుల్ గా చపాతీ, వెజ్ కర్రీ పెట్టి పంపించారు, చాలా ఉన్నతమైన చదువులు చదివి సమాజంలో ఒక మంచి స్థాయిలో ఉన్న వీరు చాలా ఉన్నతంగా ఆలోచించి మనందరికీ ఆదర్శంగా నిలిచారు, హ్యాట్స్ ఆఫ్..!

(Visited 1,778 times, 1 visits today)