Home / Entertainment / త్రిష హాఫ్ సెంచరి ?

త్రిష హాఫ్ సెంచరి ?

Author:

త్రిష ..ఈ పేరుకు ఇంట్రదక్షన్ అవసరం లేదు.  ఈ మధ్య పర్సనల్ విషయాలతోనే ఎక్కువాగా వార్తల్లోకెక్కుతున్న త్రిష హాఫ్ సెంచరి ఏంతా అనుకుంటున్నారా? ఏజ్ పెరిగే కొద్దీ బిజీగా మారుతున్న, త్వరలోనే హాఫ్ సెంచరీ కొట్టేందుకు సిద్ధమవుతోందట. ఏళ్లుగా ఇండస్ట్రీలో పాతుకుపోయిన హీరోలే 50 చిత్రాల మైల్ స్టోన్ ను రీచ్ అయ్యేందుకు నానా కష్టాలు పడుతుంటారు. కానీ, త్రిష మాత్రం ఈ ఫీట్ ను సునాయాసంగా అధిగమించబోతోంది. ఇటీవలే సకల కళావల్లభన్ అనే చిత్రంలో అలరించిన త్రిషకు అది 48వ చిత్రం కావడం విశేషం.ఆ తరువాత కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న చీకటి రాజ్యం 49వ చిత్రం కానుంది. ప్రస్తుతం త్రిష చేతిలో వివిధ భాషలవి ఏడు చిత్రాలు ఉన్నాయి కాబట్టి అమ్మడు ఏ సినిమాతో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేయబోతుందో తెలియాలంటే మాత్రం కాస్త వైత్ చేయల్సిందే.. ఏది ఏమైనా ఇలాంటి రికార్డ్ ను క్రియేట్ చేయాలంటే ఈ కాలం హిరోయిన్స్ కి దాదాపు అసాధ్యమనే చెప్పాలి. మరి తన కెరీర్ లో ఓ మైల్ స్టోన్ కు చేరుకోబోతున్న త్రిష రానున్న రోజుల్లో మరింత అందంగా అలరిస్తుందేమో చూడాలి.

(Visited 26 times, 1 visits today)