Home / Entertainment / మూవీ రివ్యూ: థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌

మూవీ రివ్యూ: థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌

Author:

ఈ ఏడాది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ ఒకటి. అగ్రకథానాయకులు అమితాబ్ బచ్చన్‌‌, ఆమిర్‌ ఖాన్‌‌ తొలిసారి కలిసి నటించిన చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది. వీరికి అందాల భామ కత్రినా కైఫ్‌ కూడా తోడవడంతో అంచనాలు మరింత పెరిగాయి. కళ్లు చెదిరే సెట్టింగులతో, అద్భుతమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌తో, సరికొత్త పోరాట సన్నివేశాలతో సుమారు రూ.300 కోట్లు వెచ్చించి ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్‌ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రంగా ప్రత్యేకత సాధించింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? అసలు ఎవరీ ‘థగ్స్‌’? చూద్దాం.

కథ:

రెండు శతాబ్దాల క్రితం బ్రిటిష్‌ పాలన కాలంలో దేశవ్యాప్తంగా కొన్ని ముఠాలు దారి దోపిడీలతో గడగడలాడించాయి. వారిని థగ్స్‌ (దోపిడీ దొంగలు) అని పిలిచేవారు. వారు బ్రిటిష్‌ ఖజానాను కొల్లగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుండటంతో ప్రభుత్వం వారిపై దృష్టిపెట్టింది. థగ్గులను ఏరిపారేయడానికి ప్రత్యేకంగా కొందరు అధికారులను నియమించింది. వారు థగ్గులను అణచివేయడానికి కర్కశంగా వ్యవహరించిన ఉదంతాలూ ఉన్నాయి. ఈ నేపథ్యానికి కల్పిత సంఘటనలను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థగ్గుల బృందానికి కమాండర్‌గా ఖుదాబక్ష్ ఆజాద్‌ పాత్రలో అమితాబ్‌, ఫిరంగి అనే జిత్తులమారి థగ్గుగా ఆమిర్‌, విలువిద్యలో ఆరితేరిన జఫీరా అనే థగ్గుగా ఫాతిమా సనా షేక్‌ నటించారు. థగ్గులను అణగదొక్కడానికి వచ్చిన కర్కశ అధికారి జాన్‌ క్లైవ్‌గా హాలీవుడ్‌ నటుడు లాయిడ్ ఓవెన్‌‌ నటించారు. సురైయ్యా అనే అందమైన నర్తకిగా కత్రినా కైఫ్‌ నటించారు. ఆకాలంలోని బ్రిటిష్‌ ముఠాలను తరిమికొట్టడానికి ఈ థగ్స్‌ ఏం చేశారు? తదితర విషయాలను తెరపై చూడాలి.

అలజడి విశ్లేషణ:

thugs-hindostan-movie-review-and-rating

నటీనటుల

సినిమా అంతా ముఖ్యంగా అమితాబ్‌, ఆమిర్‌ల పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ఇద్దరు తమ పాత్రల్లో జీవించారు. ముఖ్యంగా ఆమిర్‌ ఖాన్‌ మరోసారి తనదైన నటనతో మిస్టర్‌ ఫర్ఫెక్షనిస్ట్‌గా ప్రూవ్‌ చేసుకున్నాడు. రిస్కీ స్టంట్స్‌లోనూ అంతే పర్ఫెక్షన్‌ చూపించాడు. సీనియర్‌ నటుడు అమితాబ్‌ డెడికేషన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బరువైన కాస్ట్యూమ్స్‌ ధరించి ఆయన చేసిన యాక్షన్‌ సీన్స్‌ అభిమానులను అలరిస్తాయి. దంగల్‌ బ్యూటీ ఫాతిమా ఈ సినిమాతో యాక్షన్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. పోరాట సన్నివేశాల్లో ఫాతిమా, ఆమిర్‌తో పోటి పడి నటించారు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ ఆమె నటన ఆకట్టుకుంటుంది. కత్రినా కైఫ్‌ కేవలం రెండు పాటలకు మాత్రమే పరిమితమైంది. రెండు పాటల్లోనూ కత్రిన గ్లామర్‌ షోతో ఆకట్టుకుంది.

ప్లస్ పాయింట్స్ :

  • ఆమిర్‌, అమితాబ్‌ల నటన
  • యాక్షన్ సీన్స్‌
  • నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :

  • స్లో నేరేషన్‌
  • ద్వితీయార్ధంలో లాజిక్‌ లేని సన్నివేశాలు

పంచ్ లైన్:  ‘ఈ ‘థగ్స్‌’ మెప్పిస్తారు..!

రేటింగ్ :  2.5/5

గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

‘థగ్స్‌’ మూవీపై మీ అభిప్రాయం చెప్పండి  ?

(Visited 1 times, 1 visits today)