Home / Inspiring Stories / తమ మైనింగ్ కార్యకలాపాలకు అడ్డొస్తుందని పెద్ద పులినే చంపేసిన మైనింగ్ మాఫియా.

తమ మైనింగ్ కార్యకలాపాలకు అడ్డొస్తుందని పెద్ద పులినే చంపేసిన మైనింగ్ మాఫియా.

Author:

మానవజాతి క్రూరత్వం రోజు రోజుకు పెరుగుతుంది తప్పా తగ్గడం లేదు, భూమిపై మనుషుల సంఖ్య ఎంత వేగంగా పెరుగుతుందో అంతే వేగంగా ఇతర జంతు జాతులు కనుమరుగవుతున్నాయి. దీనిని దృవీకరించే సంఘటణ ఉత్తరాఖండ్ లోని కార్బెట్ టైగర్ రిజర్వు ప్రాంతంలో జరిగింది. మన దేశ జాతీయ జంతువు పులి, ఇతర దేశాలలో ఎప్పుడో అంతరించిపోయిన పులి జాతులు మన దేశంలోనే కాస్త చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నాయి. కాని స్వార్ధపూరిత మనషుల వలన మనదేశంలో కూడా వాటికి రక్షణ లేకుండా పోతుంది. తమ మైనింగ్ పనులకు అడ్డొస్తున్న పులిని చంపేయించిన మైనింగ్ మాఫియా గురించి కింద చదవండి.

భారతదేశంలోని అతిపెద్ద రిజర్వ్ ఫారెస్టులలో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఒకటి, చాలా సంవత్సరాలుగా ఇది రక్షిత పులుల సంరక్షణ కేంద్రంగా ఉండడం వలన అక్కడ పులుల జనాభ బాగా పెరిగింది. కాని అపార సహజ రాతి నిలువలు ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ చుట్టు పక్కల ప్రాంతాలపై మైనింగ్ మాఫియా కళ్ళు పడ్డాయి. మైనింగ్ పేరుతో అక్రమ మార్గంలో లైసెన్స్ లు సంపాదించి అడవిని తవ్వడం మొదలు పెట్టారు. పోయిన వారం అడవిలో పనిచేస్తున్న కూలీలపై ఒక పెద్దపులి దాడి చేసి ఇద్దరిని గాయపరిచింది. తీవ్ర గాయాల పాలైన ఆ కూలీలు మృతి చెందారు. దానితో బయపడిన ఇతర కూలీలు అడవిలో పని చేసేందుకు వెనుకాడారు. కాని మైనింగ్ సంస్థ ఆ పులి వలన తమ పనులు ఆగిపోతున్నాయని అటవీ అధికారులకు ఫిర్యాదు చేసి దానిని బంధించాల్సిందిగా ఒత్తిడి చేసింది. అవినీతికి అలవాటుపడిన అటవీ అధికారులు పులిని బంధించడం అనే పేరుతో దానికి ఇవ్వాల్సిన మోతాదు కన్న రెండు రెట్లు అధికంగా మత్తు మందు ఇచ్చారు అంతే కాకుండా అది సృహ కోల్పోయే వరకు వేచి ఉండకుండా దానిని జేసీబీ తో తొక్కించారు. మత్తు మందు అధిక ప్రభావంతో మరియు జేసీబీ వలన తగిలిన గాయాలతో ఆ పెద్ద పులి చనిపోయింది. మనిషి తన స్వార్ధం కొరకు పులుల అవాసం అయిన అడవిని తొలచి అడ్డొచ్చిన ఆ పులినే మట్టుబెట్టాడని జంతు ప్రేమికులు తమ బాధను వ్యక్తం చేస్తునారు.

(Visited 1,483 times, 1 visits today)