Home / Latest Alajadi / ప్రాచీన భారతదేశంలో కాలము వాటి ప్రామాణికం

ప్రాచీన భారతదేశంలో కాలము వాటి ప్రామాణికం

Author:

మన ప్రాచీన భారతదేశం లో కాలాన్ని ఎలా కొలిచేవరో తెలిస్తే, వాళ్ళ శాస్త్ర ప్రావీణ్యం ఏమిటో మీకు ఇట్టే తెలిసిపోతుంది. ఇలాంటి విజ్ఞానాన్ని మనకు అందించినది భారతీయులు అని చెప్పుకోవడానికి మనం ఎంతో గర్వపడాలి.

సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు, చంద్రోదయం నుండి చంద్రాస్తామయం వరకు, మనిషి జీవితం లో ప్రతిది, కాలంతో ముడిపడి ఉంది, సూర్య చంద్రులే కాల ప్రమాణానికి ఆధారం.

మన వారు ఒకరోజుని ఎంత సూక్ష్మముగా గణించారంటే 1 క్రతి = 1/34000 సెకను కు సమానం. ఇప్పుడు మనం రోజు మొదలు అత్యధిక స్థాయి కి మరియు అత్యల్ప స్థాయి కి ఎలా కొలిచేవరో చూద్దాం.

త్రుటి కాలమానానికి మూల ప్రమాణముగా చెయ్యబడ్డవి.

1 త్రుటి = 0.031 µs
1 రేణు = 60 త్రుటి
1 లవ = 60 రేణు
1 లీశక = 60 లవ
1 లిప్త = 60 లీశకలు
1 విగడియ = 60 లిప్తలు
1 గడియ = 60 విగడియలు (24 నిమిషాలు)
1 ముహూర్తం = 2 గడియలు (48 నిమిషాలు)
1 అహో + 1 రాత్రి = 30 ముహూర్తాలు
1 రోజు = 1 అహో – 1 రాత్రి
1 వారం = 7 రోజులు (వాటికి పేరులు ఉన్నాయు అవిమీకు తెలుసు)
1 పక్షం = 15 రోజులు (అమావాస్య,పాడ్యమి, విదియ, తదియ…..పౌర్ణమి)
1 మాసం = 2 పక్షాలు (1 కృష్ణ – 1 శుక్ల)
1 ఋతువు = 2 మాసాలు (మాసముల పేర్లు కూడా మీకు తెలుసు చైత్రం,వైశాఖం…..)
1 ఆయనం = 3 ఋతువులు
1 సంవత్సరం = 2 ఆయనములు లేదా 6 ఋతువులు లేదా 12 మాసముల (ప్రతీ 4 సంవత్సరాలకు ఒక అధిక మాసం వస్తుంది. 6 ఋతువులకు పేర్లు ఉన్నాయి, వసంతం, గ్రీష్మమం….).(మొత్తం 60 సంవస్తరాలు ప్రతీ సం|| పేరు చెప్పబడింది ప్రభావ, విభవ, 1 పుష్కరం = 12 సంవత్సరాలు. 1 మహా పుష్కరం = 12 పుష్కరాలు.)
1 యుగం = 4,320,000 సం|| (కలియుగం X 2 = ద్వాపర , కలియుగం X 3 = త్రేతా , కలియుగం X 4 = కృత)
1 చతుర్యుగం / 1 మహా యుగం = 4 యుగాలు (కృత, త్రేతా, ద్వాపర, కలియుగం)
1 మన్వంతరం = 71 చతుర్యుగాలు / 71 మహా యుగం (306,720,000 సం||)
1 కల్పం = 14 మన్వంతరం (14 మన్వంతరాలకు పేర్లు చెప్పబడ్డాయి) (30 కల్పల పేర్లు శ్వేత, నీలలోహిత….)
1 బ్రహ్మ రోజు = 2 కల్పములు
1 బ్రహ్మ మాసం = 30 బ్రహ్మ రోజులు
1 బ్రహ్మ సంవత్సరం = 12 బ్రహ్మ మాసములు
1 పదార్ధ = 50 బ్రహ్మ సంవత్సరాలు
1 బ్రహ్మ కాలం = 2 పదార్ధములు

మీరు వీటిని మన కాల ప్రమాణం లో మర్చి చూస్తే, మీరు ఆశ్చర్య పోక తప్పదు.

1 బ్రహ్మ రోజుని 1000 భాగాలుగా విభజిస్తారు వాటిని చరణాలు అంటారు.

మనం ఇప్పుడు కలియుగం, ప్రధమ పాదం, శ్వేత వరాహ కల్పం, వైవశ్వత మన్వంతరం లో ఉన్నాం…దేవాలయాలలో, ఇంట్లో నిత్యం దైవ కార్యక్రమాలలో చెప్పే సంకల్పంలో ఇది లేకుండా జరగదు.. చూసారా మనం రోజు చేసే దైవ కార్యక్రమాలలో ఎంత విజ్ఞానం దాగుందో.

ఇంతటి కాలాన్ని ఏ పరికరాలతో కొలిచారు, ఎక్కడ వాడారు అనేది మనకు ఇంకా ఒక రహస్యమే కానీ, మన పురాణాలలో, వేదాలలో, ఇంకా ఉపనిషత్తులలో వీటిని వాడటం ప్రతీ ఒక్క కాల ప్రమాణానికి నిర్దిష్టమైన పేరు పెట్టడం, అసలు మాటలకు అందనిది. వీటి వెనుక దాగి ఉన్న శాస్త్రీయతను తెలుసుకోవడానికి అనేక మంది ఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు

(Visited 535 times, 1 visits today)