Home / General / ఇతను 2050 నుండి 2017 కాలానికి రివర్స్ లో ప్రయాణించాడు అంట.. 2018లో ఏం జరగబోతుందని చెప్పాడంటే..!

ఇతను 2050 నుండి 2017 కాలానికి రివర్స్ లో ప్రయాణించాడు అంట.. 2018లో ఏం జరగబోతుందని చెప్పాడంటే..!

Author:

కాలంలో ప్రయాణించడం సాధ్యమేనా..? అంటే.. ఎవరైనా ఇందుకు సాధ్యం కాదనే సమాధానం చెబుతారు. అవును, నిజమే మరి. ఎవరైనా కాలంలో ప్రయాణం చేస్తారా..? చేయలేరు కదా.. ఇలాంటి కథలు సినిమాల్లో అయితేనే బాగా సెట్‌ అవుతాయి. కలెక్షన్ల రికార్డులను రాబడతాయి. అయితే ఇప్పుడు మేం చెప్పబోయే ఓ వ్యక్తి మాత్రం నిజంగా తాను కాలంలో ప్రయాణం చేసి వచ్చానని చెబుతున్నాడు. తాను 2048వ సంవత్సరానికి చెందిన వాడట. కానీ కాలంలో ప్రయాణించి వెనక్కి వచ్చాడట.

అతని పేరు బ్రయాంట్‌ జాన్సన్‌. ఇతనిది అమెరికా. ఇటీవలే ఇతను అక్కడి పోలీసులకు విపరీతమైన మద్యం సేవించి పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అతను వింత సమాధానాలు చెప్పాడు. తాను 2048వ సంవత్సరానికి చెందిన వాడినని, కాలంలో ప్రయాణించి 2017వ సంవత్సరానికి వచ్చానని అన్నాడు. అసలు తాను 2018 వ సంవత్సరానికి వెళ్లాలనుకున్నానని, కానీ ఆ సంవత్సరంలో గ్రహాంతరవాసులు (ఏలియన్స్‌) భూమిని నాశనం చేస్తారని కనుక ముందు సంవత్సరంలో వచ్చానని, ఈ విషయాన్ని చెప్పేందుకే ఒక సంవత్సరం ముందుకు ప్రయాణించానని అంటున్నాడు.

2048వ సంవత్సరంలో తనకు గ్రహాంతరవాసులు ఫూటుగా మద్యం తాగించారని, తన శరీరం మొత్తాన్ని మద్యంతో నింపేశారని, ఆపై తనకు కనబడిన టైమ్‌ మెషిన్‌ లాంటి ఓ ఫ్లయింగ్‌ సాసర్‌పై నిలబడి కాలంలో వెనక్కి ప్రయాణించి వచ్చానని బ్రయాంట్‌ చెబుతున్నాడు. అయితే దీన్ని మాత్రం చాలా మంది కొట్టి పారేశారు. కానీ కొందరు నిజమే అని నమ్ముతున్నారు. తాగుబోతు మాటలు పట్టుకుని మీరు నమ్ముతారా..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే కాలంలో ప్రయాణించడం మాట అటుంచితే ప్రపంచం నాశనం కావడం మాట నిజమే అని చాలా మంది విశ్వసిస్తున్నారు. ఇక మరి భవిష్యత్‌లో ఏమవుతుందో వేచి చూడాలి..!

(Visited 203 times, 1 visits today)