Home / health / కంప్యూటర్ ఎక్కువగా వాడుతున్నారా..? అయితే ఇలా చేయండి.

కంప్యూటర్ ఎక్కువగా వాడుతున్నారా..? అయితే ఇలా చేయండి.

Author:

ఇప్పుడు ఉద్యోగులు ఏ పని చేయాలన్న కంప్యూటర్ వాడటం తప్పనిసరి. పనిలో భాగంగా గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయవలసిందే. అలా నిర్విరామంగా కంప్యూటర్ ఉపయోగిస్తే పలు శారీరక సమస్యలు ఎదురవుతాయి. ప్రధానంగా కళ్ళు అలసిపోవడం, అప్పుడప్పుడు దూరపు చూపు మందగించడం, కళ్ళు ఎండిపోయినట్టు అనిపించడం, భుజం, వీపునొప్పిగా ఉండటం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని జాగ్రత్తలు పాటించి సంబంధిత సమస్యలను నివారించవచ్చు.

Office-Work-With-Computer

కంప్యూటర్ ఉపయోగించేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు :

  • మానిటర్ స్క్రీన్ కంటికి సరిపడేలా కాంట్రాస్ట్ సెట్ చేసుకోవాలి.
  • కంప్యూటర్ ఉన్న రూంలో సరైన విధంగా వెలుతురు ఉండేలా చూసుకోవాలి.
  • నిత్యం కంప్యూటర్ ముందు పనిచేసే వారు గంటకు ఒకసారి 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి.
  • పని చేసే కుర్చీ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే నడుము, మెడ,భుజం నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది.
(Visited 1,728 times, 1 visits today)