ఎక్స్పెరిమెంటల్ డైరెక్టర్ క్రిష్, మెగా వారసుడు వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న పీరియాడికల్ సినిమా కంచె ట్రైలర్ రిలీజయింది. ఫస్ట్ లుక్, పొస్టర్ చూసి ఎలా ఉంటుందో అని భయపడిన ఫాన్స్ కి గుడ్ న్యూస్. ఈ ట్రైలర్ చూసిన వాళ్ళంతా క్రిష్ తన టీం తో కలిసి టాలివుడ్ కి విజువల్ కంచె కట్టారని కితాబిస్తున్నారు.కంచె ట్రైలర్ చూస్తే రెండో ప్రపంచ యుద్ధం బాక్ డ్రాప్ లో సినిమా కథ రన్నవుతున్నట్టు తెలుస్తోంది. మాంచి ఫీలున్న లవ్ స్టోరీ కూడా కనపడుతోంది. ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్, 1942 లవ్ స్టోరీ లాంటీ సినిమాల షేడ్స్ కూడా కనబడుతున్నయి. ఏది ఏమైనా మాంచి ఫీలున్న లవ్ స్టోరీ.. అదీ ఒక ప్రపంచ యుద్ధం బాక్ డ్రాప్ లో తీయడమంటే కత్తి మీద సామే. బట్ ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఇప్పటికే బాహుబలి తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రీచవడం.. శ్రీమంతుడు లాంటి మంచి కథాబలమున్న సినిమాలు హిట్టవడం..ఇప్పుడు కంచె లాంటి సినిమా వస్తూండడం..డెఫినెట్ గా టాలివుడ్ కి మంచి రోజ్లు రాబోతున్నయనెది మాత్రం క్లియర్ గా కనబడుతోంది. తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగే ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని .. కమర్షియల్ సక్సెస్ పొందాలని..అప్పుడే మరిన్ని గొప్ప సినిమాలు వస్తాయని ప్రతి సినిమా ఫాన్ తో పాటూ అలజడి కోరుకుంటొంది. కంచె సినిమా ట్రైల్ర్ చూస్తుంటే.. టాలివుడ్ రెగులర్ మూస దోరణుల కంచె తెగిపోయి .. కొంగొత్త సినిమాలకు దారులు తెరుచుకుంటాయనే ఆశ కనబదుతోంది..మన నమ్మకాన్ని క్రిష్ నిలబెడుతాడని ఆశిద్దాం.