Home / Latest Alajadi / చేయని తప్పుకు జీవితఖైదు అనుభవిస్తున్న చెట్టు.

చేయని తప్పుకు జీవితఖైదు అనుభవిస్తున్న చెట్టు.

Author:

ప్రకృతి ముందు నువ్వేంతా, నేనేంతా…రవ్వంతా…ఈ పదాలు జనతా గ్యారేజ్ సినిమాలోని ఒక పాటలోని పదాలు. ప్రకృతి ముందు మనమంతా చాలా చిన్న వాళ్ళం కాని కొంతమంది అనాలోచితంగా కొన్ని పని లేని పనులు చేస్తుంటారు. అలాంటి ఘటనే పాకిస్థాన్‌లోని లాండీ కోటల్‌ ఆర్మీ కంటోన్మెంట్‌ ప్రాంతంలో జరిగింది. అక్కడ 1898 సంవత్సరం నుండి ఒక మర్రిచెట్టు జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నది. ఆ కథ ఎమిటో చదవండి.

tree under arrest

1898లో లాండీ ఆర్మీ కంటోన్మెంట్‌ ప్రాంతం బ్రిటీషు వారి పాలనలో ఉండేది. అప్పటి ఆర్మీ అధికారి అయిన జేమ్స్‌ క్విడ్‌ ఒక రోజు రాత్రి ఫుల్లుగా మందు త్రాగి, నడుస్తూ ఆ చెట్టుపై తూలి పడ్డాడు. దానితో అతనికి చిన్న గాయం అయ్యింది. కాని కోపంలో వివేకం కోల్పొయిన ఆ అధికారి ఆ చెట్టు దురుద్ద్యేశంతో, కావాలనే తనను గాయపరిచిందని కేసు నమోదు చేసి ఆ మర్రి చెట్టును ఉక్కు సంకెళ్లతో బంధించారు. దానితో ఆగకుండా ఆ చెట్టు కొమ్మకు “నేను అరెస్ట్ చేయబడ్డాను” అని రాసి ఒక బోర్డు కూడా తగిలించారు. ఇక అప్పటినుండి ఆ మర్రిచెట్టు ఆ ఇనుప సంకెళ్ళలో బంది అయి ఉంది. ఎన్నొ సార్లు ప్రజలు ఆ కేసును కొట్టివేయించెందుకు ప్రయత్నించిన అవి సఫలం కాలేదు. దానితో ఆ చెట్టు ఇప్పటికి చేయని తప్పుకు బంది గానే ఉంది.

(Visited 1,470 times, 1 visits today)