Cast: స్వాతి, నవీన్ చంద్ర, పూజ రామచంద్రన్..
Directed by: రాజ్ కిరణ్.
Produced by: ఎ. చినబాబు – ఎం. రాజశేఖర్
Banner: క్రేజీ మీడియా.
Music Composed by: కమ్రాన్
చిలిపి తరహా క్యారెక్టర్ చేసే స్వాతి హీరోయిన్ ఓరియెంటేడ్ కథ చేసింది. అందాల రాక్షసి ,దళం లాంటి సినిమాల్లో చేసిన నవీన్ చంద్ర కూడా ఉన్నాడు… ముఖ్యంగా గీతాంజలి లాంటి చిన్న హర్రర్ సినిమాని తీసి హిట్ కొట్టిన రాజ్ కిరణ్ దర్శకుడు ఇలా అన్ని పాయింట్లూ పాజిటివ్ టాక్ ని తెచ్చేవే అందుకే త్రిపుర పై మంచి అంచనాలతోనే ఎదురు చూసారు ప్రేక్షకులు… అందులోనూ రాజు గారి గది వంటి ఒక హర్రర్,థ్రిల్లర్ కూడా త్రిపుర కోసం మంచి బేస్ ని తయారు చేసి పెట్టింది… మరి ఇన్ని ఆకర్షణల మధ్య వచ్చిన “త్రిపుర” ఎలా ఉంది… తెలుసుకోవాలంటే..
వరాహపట్నం అనే గ్రామానికి చెందిన అమ్మాయి త్రిపుర(స్వాతి). తనకి చిన్నప్పటి నుంచి వచ్చే కొన్ని కలలు నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి.అలా మానసిక ఒత్తిడికి గురౌతున్న త్రిపుర ని ట్రీట్ మెంట్ కోసం అని సిటీ తీసుకెళ్తే అక్కడ త్రిపురని ట్రీట్ చేసిన డాక్టర్ నవీన్ చంద్ర (నవీన్ చంద్ర) తన ప్రేమలో పడతాడు.ఇద్దరి ప్రేమా ఫలించి పెల్లి కూడా చేసుకుంటారు…. ఐతే కొత్త కాపురం మొదలు పెట్టిన ఇంట్లోనే ఒక ద్యాం ఉందని తెలుస్తుంది. అంతేకాదు త్రిపుర మరో భయకరమైన కల కంటుంది ఆ కల నిజమైతే ఆమె జీవితమే తల కిందులౌతుంది. అదే సమయంలో చంద్రకు, డాక్టర్ ఈశ(పూజ రామచంద్రన్)కు మధ్య గతంలో లవ్ స్టోరీ ఉందనే విషయం తెలుస్తుంది.ఐతే ఈష మిస్సవటం తో కాక ఆమె హత్య చేయ బడిందని తెలుస్తుంది. ఇన్స్పెక్టర్ తిలక్ (తిలక్) డాక్టర్ ఈష కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూంటాడు.అతని అనుమానం ఈ హత్య డాక్టర్ నవీన్ చంద్ పైనే. అసలు ఈ కలలు నిజం అవటం ఏమిటి.?? స్వాతికి వచ్చింబ ఆ చివరి భయంకరమైన కల ఏమిటి..? అసలు ఈశ మరణం వెనక ఉన్న రహస్యం ఏమిటి…దానికి చంద్రకు సంభందం ఏమిటి…అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా విషయానికి వస్తే.. డైరెక్టర్ రజ్ కిరణ్ ఈ సినిమా కోసం ఎక్కువ శ్రద్ద తీసుకోలేదు. ఈ ఒక్క సినిమాని తీయటానికి ఆయన చాలా సినిమా లని చూసి నప్పుడు మాత్రమే కష్ట పడి ఉందాలి ఎందుకు అంటే.. ప్రేమకథా చిత్రమ్, గీతాంజలి,చంద్రముఖి లాంటివె కాకుండా హాలీవుడ్ సినిమాలు ఓవర్ హర్ డెడ్ బాడీ, వైట్ డ్రీమ్స్, వెన్ డ్రీమ్స్ కమ్స్ ట్రూ లాంటి సినిమాల్లోని కొన్ని కొన్ని సీన్లు కత్తిరించి కలుపుకుంతే ఈ త్రిపుర సినిమాకి కథ నుంచి సీన్స్ వరకూ అన్నీ తయారై ఉనట్టుగా అనిపిస్తుంది. హార్రర్ నేపథ్యంలో అనేక సినిమాలు వస్తున్న తరుణంలో కొత్తదనం ఏమీ కనిపించక పోయినా హార్రర్‌కు కావల్సిన అన్ని అంశాలను దర్శకుడు రాజ్ కిరణ్ ఇందులో పూర్తిగా చేర్చాడు. సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్ కలలు నిజం అవటం కానీ ఈ ముఖ్యమైన పాయింట్ నే మధ్యలో వదిలేసి చివర్లో కాస్త కలిపారు.సినిమాలో చాలా డ్రాబాక్స్ ఉన్నాయి. నిజానికి త్రిపుర అనే అమ్మాయికి వచ్చే కలల గురించి చెప్పే సినిమా అన్నారు. మొదట్లో స్వాతి కనే కలలను సిల్లీగా చూపించారు. ఆ తర్వాత వాటినే సీరియస్ గా చూపించే ప్రయత్నం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే వచ్చిన హారర్ కామెడీ కథలు తీస్కొని రాబోయే హారర్ సినిమాని తయారు చేసిన అతుకుల బొంత..
స్వాతి: కథ మొత్తం తన చుట్టునే తిరుగుతుందు ఐతే మిగిలిన పాత్రలు కూడా చాలా కీలకమే. స్వాతి సినిమా కోసం త్రిపుర పాత్ర కోసమూ బాగానే కష్టపడింది. ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాల కంటే భిన్నమైన నటను స్వాతి త్రిపుర సినిమాలో చేసింది. లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్ సినిమాలకు స్వాతి పక్కా సూట్ అవుతుంది. సినిమా మొత్తం తన పాత్రకు న్యాయం చేసి చక్కగా స్వాతి తన పెర్పామెన్స్‌తో మెప్పించింది. సినిమా విజయవంతం అయ్యేందుకు తన శాయశక్తులా అన్ని కోణాల్లోనూ నటనను ప్రదర్శించింది.క్లైమాక్స్ లో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ సినిమాకు ఖచ్చితమైన ప్లస్ అని చెప్పొచ్చు.
నవీన్ చంద్ర: హీరోగా చేసిన నవీన్ చంద్ర సినిమాకి చాలా హెల్ప్ అయ్యాడు. తన కి చాలా అనుభవం ఉన్నట్టే చాలా బాగా నటించాడు. ఇన్నోసెంట్ గా, నెగటివ్ షేడ్స్ లో అద్బుతమైన ఎక్స్ప్రెషన్స్ ని పలికించిన నవీన్ చంద్ర, క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో సూపర్బ్ గా చేసాడు. మన నిర్మాతలూ,దర్షకులూ ఇంతమంచి యాక్టర్ ని ఎందుకు పక్కన పెడుతున్నారో అర్థం కాదు.
ఇక పూజ రామ చంద్రన్ కూడా తన రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. పెర్ఫార్మన్స్ కూడా బాగా చేసింది. ధన రాజ్ పెళ్లి కొడుకుగా నవ్వించే ప్రయత్నం చేసాడు. సప్తగిరి సినిమాలో చాలా సేపు ఉన్నప్పటికీ నవ్వించింది మాత్రం చాలా తక్కువ. ప్రతి సినిమాల్లో లానే చాలా అంటే చాలా రెగ్యులర్ గా ఉంది సప్తగిరి పాత్ర కానీ కాస్తో కూస్తో నవ్వించి మధ్యలో వచ్చే బోర్ ని ఆపగలిగాడు. ఇక జయప్రకాశ్ రెడ్డి, శ్రీమాన్, శకలక శంకర్ లు కాస్త నవ్వించారు. మరోసారి విలన్‌గా తన మార్క్ నటన చూపించాడు. శ్రీమాన్, తదితరులు తమ పాత్రల పరిదిమేర
ఇటీవల తెలుగులో బాగా సక్సెస్ అవుతున్న హర్రర్, కామెడీ జోనర్‌ను ఫాలో అవటం వరకూ ఓకే నే గానీ కథను సరిగ్గా ప్రెజెంట్ చేయటం లోనూ దర్శకుదు రాజ్ కిరణ్ తడబడ్డాడు. ఓ మర్డర్ సీన్‌తో సినిమాను ఇంట్రస్టింగ్‌గా స్టార్ట్ చేసిన దర్శకుడు తర్వాత ఆ టెంపోను కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. కథ లో దాదాపు ప్రతీ కీలకమైన సీనూ ఇదివరకే చూసిన సినిమాని గుర్తుకు తెస్తాయి. పాత్రల కోసం అనుకున్న స్వభావాన్ని కూడా సరిగా చూపలేదు. అలాగే సినిమాకి మెయిన్ కీ పాయింట్ అయిన డ్రీమ్స్ అనే కాన్సెప్ట్ గురించి అస్సలు క్లారిటీ ఇవ్వలేదు. అలాగే ఈ
సినిమాని కేవలం 2 గంటల్లో ఫినిష్ చెయ్యాలి కానీ కమర్షియల్ అనే మోజులో పరమ రొటీన్ కామెడీని బలవంతంగా ఇరికించి చిరాకు పెట్టడమే కాకుండా, మధ్యలో పాటల్ని పెట్టి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. చాలా చోట్ల ప్రేమ కథాచిత్రమ్, గీతాంజలి, రాజుగారి గది లాంటి సినిమాలలోని సీన్స్ నే మళ్ళీ రిపీట్ గా చూస్తున్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. .కథే చాలా రొటీన్‌గా ఉన్నప్పుడు డైరెక్టర్ జిమ్మిక్కులు, మ్యాజిక్కులు చేసి ప్రేక్షకుడిని కట్టి పడేయాలి. కానీ త్రిపుర మూవీ విషయంలో రాజ్ కిరణ్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.ఫస్టాఫ్‌లో సోసోగా బండి లాగించిన దర్శకుడు సెకండాఫ్‌లో చాలా సీన్లను సాగదీసేశాడు. ఎడిటింగ్ కూడా పేలవంగా ఉంది. సెకండాఫ్‌లో ప్రేక్షకుడికి చాలా సీన్లు పరమబోర్ కొట్టించాయి.
ఇక మిగిలిన విసయాలకి వస్తే కమ్రాన్ అందించిన పాటలు బాగాలేక పోగా తను అందించిన నేపధ్య సంగీతం కూడా సినిమాకి అస్సలు హెల్ప్ అవ్వలేదు. హార్రర్ సినిమాలకు కీలకంగా చెప్పుకునే నేపథ్య సంగీతం ఇందులో ఆశించిన స్థాయిలో రాలేదనే చెప్పవచ్చు. అలాగే ఇంకొక పెద్ద డ్రా బ్యాక్ ఉపేంద్ర ఎడిటింగ్ సినిమా అంతలా సాగుతున్నట్టున్నా ఆయనకీ ఎక్కడా కట్ చేయాలి అనిపించకపోవడం ఏమిటో అర్థం కాదు. ఆర్ట్ వర్క్ బాగుంది. రాజా డైలాగ్స్ లు గొప్పగా లేక పోయినా మరీ తక్కువ గా కూడా ఏమీ లేవు ఈ సినిమాకి ఆయన చాలు.. సిజి వర్క్ కూడా డీసెంట్ గా ఉంది. ఓవరాల్ గా క్రేజీ మీడియా ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాగా రిచ్ గా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ రవికుమార్ వర్క్ ఒక్కటి మాత్రం చక్కగా ఉండి కాస్త ఊరటనిస్తుంది. విజువల్స్ పరంగా మాత్రం సినిమా మూడ్ కి సెట్ అయ్యేలా, చాలా కలర్ఫుల్ గా సినిమాని చూపించాడు.