Home / Latest Alajadi / తెరాస కు ఆంధ్రాలో నిజంగానే ఫాలోయింగ్ ఉందా.? ఆంధ్ర రాజకీయాల్లో నిజంగానే అడుగుపెడతారా.?

తెరాస కు ఆంధ్రాలో నిజంగానే ఫాలోయింగ్ ఉందా.? ఆంధ్ర రాజకీయాల్లో నిజంగానే అడుగుపెడతారా.?

Author:

తెరాస కు నిజంగానే ఆంధ్రాలో క్రేజ్ ఉందా.? అసలు ఏ నమ్మకం తో టీఆర్ఎస్ ఆంధ్ర రాజకీయాల్లో పాల్గొంటాం అంటున్నారు.? ప్రస్తుతం తెలంగాణ లో రాజకీయ వేడి తగ్గింది. కానీ ఆంధ్రాలో ఇప్పుడే మొదలైంది. ఆంధ్ర రాజకీయాల్లో ఊపు తెచ్చేందుకు తెరాస పార్టీ సిద్ధం అయ్యింది.

చంద్ర బాబు గవర్నమెంట్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని తెరాస పార్టీ అధినేత కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. అసలు తెరాస పార్టీ ఎవరిని చూసుకొని ఆంధ్రాలో చంద్రబాబు కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం అంటున్నారని చాలా మందికి వస్తున్న ప్రశ్న. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ కి ప్రత్యర్ధిగా ఉన్న ఏకైక బలమైన పార్టీ వైసీపీ. వైకాపా పార్టీ అధినేత జగన్ ఆంధ్ర రాష్ట్రమంతటా పాదయత్ర చేస్తూ జనం మధ్యనే తిరుగుతున్నారు.

ఇక జనసేన పార్టీ మీద ఎవ్వరికి పెద్దగా నమ్మకం లేదు, ఎన్నికల్లో జనసేన ప్రభావం అస్సలు ఉండదు. ఉత్తరాంద్ర, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో కొన్ని సీట్ లు వచ్చే అవకాశం ఉన్నా, కష్టమే. కానీ తరువాత వచ్చే 2024 ఎన్నికల వరకు జనసేనని జనం మధ్యనే ఉంటే ఒక ప్రత్యర్థి పార్టీ ఉంది అని జనాలు గమనించి ఓట్లు వేస్తారు.

ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ కు తెరాస మద్దతు ఇవ్వనుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. వైకాపా, తెరాస తో కలిసి జనసేన పార్టీ ముందుకు కదులుతుందని అని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే జగన్, పవన్ లు కూటమి గా ఏర్పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ తెరాస నాయకులు మాత్రం వారి ప్రసంగాల్లో వైకాపా కు మద్దతు ప్రకటించేల ఇండైరెక్టు గా చెబుతున్నారు.

హైదరాబాద్ లో ఎక్కువగా ఆంధ్ర వాళ్ళు నివసించే ఏరియా లలో కూడా తెరాస గెలవడం తో, తెరాస నమ్మకానికి మరింత బలం చేకూర్చింది. తెలంగాణ లో ఏ విధంగా అయితే తెలుగుదేశం ఓటమి పాలైందో, ఆంధ్ర లో కూడా అదే విధంగా ఓడిపోతుందని కేటీఆర్ పదే పదే చెబుతున్నారు.

(Visited 1 times, 1 visits today)