Home / Devotional / తులసి మొక్క తో భవిష్యత్తు తెలుసుకోవచ్చా ?

తులసి మొక్క తో భవిష్యత్తు తెలుసుకోవచ్చా ?

Author:

దాదాపు తుల‌సి మొక్క లేని ఇల్లు ఉండదు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తులసి వల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలున్నాయి. తుల‌సి చెట్టు ఇంట్లో ఉంటే మంచిద‌ని అంతా మంచే జ‌రుగుతుంద‌ని నమ్మకం. అంతేకాదు తులసి ఆకుల వ‌ల్ల మ‌నం ప‌లు జబ్బులను కూడా దూరం చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి తెల‌సిన విషయాలే. కానీ, ఈ తులసి మొక్క త‌న స‌హ‌జ రంగును కోల్పోవ‌డ‌మో, ఆకులు స‌డెన్‌గా ఎండిపోవ‌డ‌మో లేదా రాలిపోవడ‌మో జరుగుతుంది. ఈ మార్పులను బట్టి ఇంట్లో వారికి భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో తెలుసుకోవ‌చ్చ‌ట‌. ఒక రకంగా తుల‌సి చెట్టు మార్పులు మన భవిష్యత్తుకు సంకేతాలట. తులసిలో మార్పులు.. వాటి అర్థం ఏంటో తెలుసుకుందాం.

tulasi will tell your future

  • తుల‌సి చెట్టు ఎప్పుడూ ప‌చ్చ‌గా ఉంటే.. ఇంట్లో ఆనందం, సంతోషం మనవెంటే ఉంటాయట. ఇంట్లో వారికి ఎలాంటి స‌మ‌స్య‌లు రావ‌ని అర్థమట‌.
  • ఒక వేళ నీళ్లు పోయ‌కున్నాతులసి మొక్క బాగా ప‌చ్చ‌గా, ఏపుగా పెరుగుతుంటే.. ఇంట్లో వారికి అదృష్టం క‌ల‌సి రాబోతుంద‌ని అర్థమట. భ‌విష్య‌త్తులో వారికి సంప‌ద బాగా వ‌స్తుంద‌ట‌
  • ఒకవేళ పచ్చగా కళకళలాడుతున్న తుల‌సి చెట్టు ఆకులు స‌డెన్‌గా ఎండిపోతే.. ఆ ఇంటి య‌జ‌మానికి ఆరోగ్యం ప‌రంగా కీడు జ‌ర‌గ‌బోతుంద‌ని అర్థం. ఏదైనా పెద్ద అనారోగ్యం వచ్చే అవ‌కాశం ఉంటుంద‌ని అర్థం.
  • చెట్టు ఆకులు స‌డెన్‌గా వేరే రంగుకు మారితే.. ఇంట్లో ఉన్న‌వారు క్షుద్ర శ‌క్తుల బారిన పడనున్నారని అర్థమట. ఎవరైనా గిట్టనివారు క్షుద్ర శక్తులు ప్ర‌యోగించినపుడే తుల‌సి ఆకులు రంగు మారుతాయ‌ట‌.

దీన్నిబట్టి, తులసి మొక్కని భక్తిగా పూజ చేయడమే కాదు.. తలసి మొక్క ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి. మొక్కలో మార్పులూ గమనిస్తూ ఉండండి.

(Visited 2,467 times, 1 visits today)