Home / General / UIDAI హెచ్చరిక:ఆధార్ కార్డులు లామినేషన్ చేయించొద్దు…! అవి చెల్లవు…!

UIDAI హెచ్చరిక:ఆధార్ కార్డులు లామినేషన్ చేయించొద్దు…! అవి చెల్లవు…!

Author:

ఆధార్ కార్డులని లామినేషన్ చేయించడం, ప్లాస్టిక్ ఆధార్ కార్డులని తీసుకోవద్దని వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆధార్ వ్యవహారాలని చూసే యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా (UIDAI) సంస్థ అధికారులు తెలిపారు. ప్లాస్టిక్ ఆధార్ కార్డులు, లామినేషన్ చేసిన ఆధార్ కార్డుల వల్ల ఆధార్ కార్డు బార్ కోడ్ ని స్కానర్ లు గుర్తించలేకపోతున్నాయి అని, అలాగే ఈ ప్లాస్టిక్ ఆధార్ కార్డుల వల్ల వ్యక్తిగత వివరాలు చోరీకి గురయ్యే అవకాశముందని యూఐడీఏఐ ప్రతినిధులు తెలిపారు. సాధారణ కాగితంపై డౌన్‌లోడ్ చేసుకున్న ఆధార్‌కార్డు, ఎం-ఆధార్ మాత్రమే చెల్లుబాటు అవుతాయని UIDAI చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అజయ్ భూషణ్‌పాండే తెలిపారు.

ప్లాస్టిక్ ఆధార్ తీసుకోవద్దు

కొంతమంది షాఫుల యజమానులు రూ.50 నుంచి 300 వరకు చార్జ్ వసూలు చేస్తూ ప్లాస్టిక్ ఆధార్‌కార్డులు ఫ్రింట్ చేసి ఇస్తున్నారని. అటువంటి వారి నుంచి అప్రమత్తంగా ఉండాలని అజయ్ భూషణ్‌పాండే తెలిపారు. అన్ని రకాల అవసరాల కోసం వినియోగదారులు ఖచ్చితంగా సాధారణ ప్రింటెడ్ ఆధార్, ఎం-ఆధార్‌లనే వాడాలని ఆయన అన్నారు. కలర్ జిరాక్స్ లని లామినేషన్ చేయించి వాడొద్దని సూచించారు, ఎవరైనా ఆధార్‌కార్డు పోగొట్టుకొని ఉంటే https://eaadhaar.uidai.gov.in కి లాగిన్ అయి ఆధార్‌కార్డును ఉచితంగా పొందవచ్చని తెలిపారు.

(Visited 470 times, 1 visits today)