Home / Latest Alajadi / IPL లో రూ.8.4కోట్లకు రికార్డు ధర..! ఎవరీ వరుణ్ చక్రవర్తి? అతని గురించి ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!

IPL లో రూ.8.4కోట్లకు రికార్డు ధర..! ఎవరీ వరుణ్ చక్రవర్తి? అతని గురించి ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!

Author:

వరుణ్‌ చక్రవర్తి ఐపీఎల్‌ సీజన్‌ 12 కోసం జరగుతున్న ఆటగాళ్ల వేలంలో సంచలనం నమోదు చేశాడు. అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ ఆటగాడి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డారు. ఏకంగా రూ.8.40 కోట్ల రికార్డు ధరకు కింగ్స్‌ పంజాబ్‌ సొంతం చేసుకుంది.

తమిళ ఆల్‌రౌండర్ అయిన వరుణ్‌ చక్రవర్తి.‌. జాతీయ జట్టుకైతే ఇంతవరకు ఆడలేదు. అంతెందుకు రంజీ మ్యాచ్‌ కూడా అడింది ఒక్కటే. అదీ ఈ ఏడాదే. నిజానికి బాల్యం నుంచే అతనేమీ క్రికెట్‌ పిచ్చోడు కాదు. చాలా ఆలస్యంగా తన 13వ ఏట ఆటకు పరిచయమయ్యాడు. 17 ఏళ్ల వయసు వరకు వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా ఆడాడు. కానీ ఆయా వయో విభాగం పోటీల్లో తరచూ అతన్ని నిరాకరించడంతో ఆటకు బైబై చెప్పి ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌లో ఐదేళ్ల డిగ్రీ పూర్తిచేశాడు.

అప్పుడప్పుడు టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ ఆడుతుండటం వల్ల మళ్లీ ఆటపై మనసు పెట్టాడు. అంతే ఈసారి వరుణ్‌ జాబ్‌కు టాటా చెప్పి ఆటకు సై అన్నాడు. క్రోమ్‌బెస్ట్‌ క్రికెట్‌ క్లబ్‌లో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా చేరాడు. కానీ మోకాలి గాయంతో పేస్‌ను వదిలేసి స్పిన్నరయ్యాడు. జూబ్లీ క్రికెట్‌ క్లబ్‌ తరఫున చెన్నైలో ఫోర్త్‌ డివిజన్‌ లీగ్‌ క్రికెట్‌ ఆడాడు. గత 2017–18 సీజన్‌లో ఆ క్లబ్‌ జట్టు తరఫున ఏడు వన్డేలాడిన వరుణ్‌ 3.06 ఎకానమీతో 31 వికెట్లు తీశాడు.

వరుణ్ చక్రవర్తికి కోల్‌కతా జట్టు కెప్టెన్‌గా ఉన్న కార్తీక్ గత సీజన్‌లో వరుణ్ చక్రవర్తితో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడట. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో చక్కగా రాణిస్తోన్న చక్రవర్తి గురించి తెలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేసేందుకు కార్తీక్ పిలిపించాడట. ఇలా ఆ జట్టు కోచ్ సునీల్ నరైన్ తనకు బౌలింగ్‌లో మెలకువలు నేర్పాడని అవి కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వివరించాడు.

ఇక ఇప్పటివరకూ జరిగిన వేలంలో జయదేవ్‌ ఉనాద్కత్‌(రూ. 8.40 కోట్లు-రాజస్థాన్‌), శివం దుబే(రూ. 5కోట్లు-ఆర్సీబీ), వరుణ్‌ చక్రవర్తి(రూ. 8.40 కోట్లు- కింగ్స్‌ పంజాబ్‌)లు జాక్‌పాట్‌ కొట్టారు. హనుమ విహారి కనీస ధర రూ. 50 లక్షలుండగా, రూ. 2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసింది. ఇక కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ ను రూ. రూ. 5 కోట్లకు కేకేఆర్‌ తీసుకోగా, హెట్‌మెయిర్‌ను రూ. 4.20 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.

(Visited 1 times, 1 visits today)