Home / General / యూపీ సంచలన నిర్ణయం :మాంసాహారం, మద్యం తీసుకోని పోలీసులు కావాలి

యూపీ సంచలన నిర్ణయం :మాంసాహారం, మద్యం తీసుకోని పోలీసులు కావాలి

Author:

వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో కుంభమేళా ప్రారంభంకానుంది.ఈ నేపథ్యంలో కుంభమేళాలో విధులు నిర్వర్తించే సిబ్బంది కోసం పోలీసు ఉన్నతాధికారులు పోలీసులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ఇంటర్వ్యూ చేసి ‘మంచి వ్యక్తిత్వం’ అనే సర్టిఫికెట్‌ ఇస్తేనే కుంభమేళాలో విధులు నిర్వర్తించే అవకాశం పోలీసులకు లభిస్తుంది. షాజహాన్‌పూర్‌, ఫిలిబిత్‌, బరేలీ, బదౌన్‌ జిల్లాలోని పోలీసుల వ్యక్తిత్వాలను పరిశీలించాలని జిల్లా ఎస్‌ఎస్‌పీలను అధికారులు కోరారు.

కుంభమేళాలో విధులు నిర్వర్తించాల్సిన పోలీసులను వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలు చేయాలని అడుగుతూ ఎస్‌ఎస్‌పీలకు లేఖ రాశామని డీఐజీ(కుంభ్‌) కేపీ సింగ్‌ విలేకరులకు తెలిపారు.

UP Govt shocking decision on police selction

కుంభమేళాకు హాజరయ్యే భక్తుల సెంటిమెంట్‌ ను దృష్టిలో పెట్టుకుని శాకాహారులు, మద్యం సేవించని, సిగరెట్‌ తాగే అలవాటు లేని, మర్యాదపూర్వకంగా వ్యవహరించే పోలీసులను డ్యూటీల్లో నియమించాలని అధికారులు నిర్ణయించారు.అలాగే కుంభమేళాలో విధులు నిర్వర్తించే పోలీసుల విషయంలో మరికొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. వారు అలహాబాద్‌ వాసులై ఉండకూడదు. కానిస్టేబుళ్ల వయసు 35ఏళ్లు మించకూడదు. హెడ్‌కానిస్టేబుల్‌ అయితే 40ఏళ్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అయితే 45ఏళ్లు దాటకూడదు.

(Visited 1 times, 1 visits today)