Home / Devotional / రోజూ ఈ సులువైన ముద్రలు వేయండి… సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి….

రోజూ ఈ సులువైన ముద్రలు వేయండి… సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి….

Author:

రోజు యోగ చేస్తే మనకు అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు. కొందరికి యోగ చేయాలంటే బద్దకంగా ఉంటుంది అలాంటి వారికి కొన్ని సులువైన పద్దతులలో మన చేతి వేళ్లను కొన్ని ప్రత్యేకమైన భంగిమలలో పెట్టి ధ్యానం చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు.

mudras-of-yoga

1) జ్ఞాన ముద్ర :
పద్మాసనం లో కూర్చొని రెండు చేతుల బొటన వేళ్లను చూపుడు వేళ్ళకు ఆనిచ్చి ఉంచాలి. ఈ ఆసనంలో కొద్దీ సమయం గాలి పీల్చుతూ, వదులుతూ ఉండాలి. ఇలా చేయడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది.శరీరానికి రక్త ప్రసరణ వ్యవస్థ పెరిగి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.

2) శూన్య ముద్ర :
పద్మాసనంలో కూర్చొని మన మధ్య వేళ్లన్ని మధ్యలోకి మడిచి వాటి పై బొటన వేలిని కొద్దీ సేపు ఉంచాలి. ఇలా ధ్యానం చేయడం వలన చెవు నొప్పులు, చేతి నొప్పులు,కాళ్లల్లో స్పర్శ జ్ఞానం కోల్పోవడం వంటిది దూరం అవుతుంది.

3) ఆకాశ ముద్ర :
రెండు చేతుల మధ్య వేళ్లను, బొటన వెళ్ళ చివర ఆనించి కొద్దీ సేపు ఉంచాలి. అలాచేయడం వలన మన శరీరంలో నెగిటివ్ శక్తి నశించి, పాజిటివ్ శక్తి ప్రవహిస్తుంది. లాగే శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.

4) ప్రాణముద్ర:
బొటన వేలి అంచుతో – చిటికెన వేలు ఉంగరం వేలు అంచులను కలిపి /తాకించి వుంచవలెను . చూపుడు మద్య వేళ్ళు నిటారుగా వుంచవలెను . ఈ ముద్ర వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది . నీరసం నిస్సత్తువ తగ్గి శక్తిని కలిగిస్తుంది . అనవసరమైన మానసిక ఆందోళన తగ్గి ప్రసాంతత కలుగుతుంది . దీని వలన కంటి దృష్టి కి బలం కలుగుతుంది . ఆలోచనలో స్పష్టత వస్తుంది .

5) వాయుముద్ర:
చూపుడు వేలును మధ్యకు మడిచి బ్రొటన వేలితో నొక్కి పట్టుకొని వేసే వాయుముద్ర వలన చాల ఉపయోగాలు ఉన్నాయి. ఈ ముద్ర వేసి ధ్యానిస్తే కీళ్ళనొప్పిని నివారించవచ్చు. పార్కిన్సొన్, పోలీయో వ్యాధి వలన వచ్చే నొప్పి ని ఈ ముద్ర తగ్గిస్తుంది.

6) పృధ్వీ ముద్ర :
రెండు చేతుల ఉంగరం వెళ్ళ చివరన బొటన వేళ్ళతో పట్టుకోవాలి. ఇలా చేయడం వలన కండరాలు రిలాక్స్ అవుతాయి. కొత్త కండరాల రూపకల్పన జరుగుతుంది.

(Visited 8,152 times, 1 visits today)