Home / General / ఏడాది పాటు స్మార్ట్ ఫోన్ వాడకుండా ఫీచర్ ఫోన్‌ వాడితే రూ.72 లక్షలు మీవే.! ఎలా పొందాలంటే.?

ఏడాది పాటు స్మార్ట్ ఫోన్ వాడకుండా ఫీచర్ ఫోన్‌ వాడితే రూ.72 లక్షలు మీవే.! ఎలా పొందాలంటే.?

Author:

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ఒక భాగమయిపోయింది అంటే అతిశయోక్తి లేదు అనుకుంట. భోజనం అయినా ఒక పూట మానేస్తామేమో గాని…స్మార్ట్ ఫోన్ వాడకుండా మాత్రం ఒక పూట కూడా ఉండలేము. అంతలా అడిక్ట్ అయిపోయాము. ఈ స్మార్ట్ ఫోన్స్ పుణ్యమా అని దూరంగా ఉన్నవారు దగ్గరవుతున్నారని సంతోషపడాలో…లేక దగ్గరగా ఉన్నవారు కూడా దూరమవుతున్నారని బాధ పడాలో.! చేతిలో ఫోన్ లేకుండా కనిపించేవారు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అంటే బదులివ్వడం కష్టమే. మరి సెల్ ఫోన్ కి ఇంతగా బానిసైన తరుణంలో కంగా ఏడాది పాటు స్మార్ట్‌ఫోన్ ముఖం చూడకుండా ఉండగలరా? ఒకవేళ మీరు సెల్ ఫోన్ ఏడాది పాటు వాడకుండా ఉంటె మాత్రం బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే..! రూ.72 లక్షల మొత్తం దక్కించుకోవచ్చు!

కోకోకోలా‌కు చెందిన విటమిన్ వాటర్ అనే కంపెనీ ఈ ఆఫర్ ప్రకటించింది. ‘స్క్రోల్ ఫ్రీ ఫర్ ఎ ఇయర్’ పేరుతో ఈ అమెరికన్ కంపెనీ ఓ పోటీ నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనేవారు ఏడాదిపాటు స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి. వచ్చే ఏడాది జనవరి 8 నుంచి విటమిన్ వాటర్ సంస్థకు చెందిన అధికారిక ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫోన్‌ లేకుండా సమయాన్ని ఏడాది సమయాన్ని ఎలా గడపుతామనే విషయాన్ని హ్యాష్‌ట్యాగ్ #NoPhoneforaYear, #contest ఉపయోగించి పంపాల్సి ఉంటుంది. పోటీదారుడు ఇచ్చే సమధానంపై సంతృప్తి చెందితే అతడిని ఎంపిక చేస్తారు. అనంతరం కాంట్రాక్ట్ పత్రాలపై సంతకం చేయించుకుంటారు.

పోటీదారులు కేవలం స్మార్ట్ ఫోన్‌కు మాత్రమే దూరంగా ఉండాలి. కంప్యూటర్లను యథాతథంగా ఉపయోగించవచ్చు. వాయిస్ యాక్టివేటెడ్ డివైజ్‌లు అయిన గూగుల్ హోం, అమెజాన్ ఎకో వంటి వాటిని ఉపయోగించుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ కానీ, ట్యాబ్లెట్స్‌ను మాత్రం ఉపయోగించవద్దు.

పోటీలో పాల్గొన్న వారు మొత్తం చివరి వరకు పోటీలో ఉండాలనేం లేదు. కనీసం ఆరు నెలలు స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉన్నా రూ.7 లక్షలు ఇవ్వనున్నట్టు విటమిన్ వాటర్ సంస్థ పేర్కొంది. అయితే, ఇంట్లోవాళ్లు, స్నేహితులతో మాట్లాడేందుకు మాత్రం 1996 నాటి ఫీచర్ ఫోన్‌ను ఇవ్వనున్నట్టు సంస్థ తెలిపింది. ఇందులో ఇంటర్నెట్ వాడుకునే వెసులుబాటు ఉండదు. కేవలం వాయిస్ కాల్స్‌కు మాత్రమే ఇది పరిమితం. మరెందుకు ఆలస్యం.. మీరూ ట్రై చేయరాదూ!

(Visited 1 times, 1 visits today)