Home / health / వక్క పొడి తింటున్నారా..? అది మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.

వక్క పొడి తింటున్నారా..? అది మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.

Author:

మనం ఎక్కూవగా వక్కపొడిని భోజనం చేసిన తర్వాత తినటానికి ఇష్టపడుతాం. వక్కపొడిని పాన్ లేదా తమలపాకులో చుట్టుకొని ప్రతి రోజు వేలమంది తినటం మనం తరచు గమనిస్తూ ఉంటాం. ప్రతి దేశంలో పాన్ వివిధ రకాలుగా తయారు చేస్తున్నప్పటికీ వీటిలో సామాన్యంగా తమలపాకు, నిమ్మ, ఏలకులు, దాల్చిన చెక్క మరియు పొగాకులను వాడి తయారు చేస్తారు. పాన్ తయారీలో వక్కపొడి ముఖ్యపాత్ర పోషిస్తుంది. వక్కపొడి వల్ల వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశాలుఎక్కువగా ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది.

vakkapodi-may-cause-cancer

“ది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్” వారు చేసిన పరిశోధనల్లో పాన్ లో కలిపే ఏలకులు మరియు దాల్చిన చెక్క మినహా ప్రతి పదార్థం క్యాన్సర్ కారకమవుతుందని తెలిపారు. మహమ్మారి క్యాన్సర్ ను కలుగచేసే పట్టికలో ‘వక్కపొడి’ మొదటి స్థానంలో ఉందట. “వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్” ప్రకారం, వక్కపొడి తినటం వలన క్యాన్సర్ కలిగే అవకాశం పుష్కలంగా ఉందని, ముఖ్యంగా నోటి మరియు అన్నవాహిక క్యాన్సర్ కు గురయ్యే అవకాశం ఉందని చాలా పరిశోధనలలో వెల్లడించబడింది. వక్కపొడి ఎక్కువగా నమిలే వారిలో ‘సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్’ అధికంగా ఉత్పత్తి చెందుతుంది. ఇలా సబ్ మ్యూకస్ అధికంగా ఉత్పత్తి చెందటం వలన దవడ కదలికలలో అవాంతరాలు ఏర్పడతాయి.అందువల్ల వక్కపొడి నమలడం అలవాటున్న వారు ఇకపైన అయిన ఆ అలవాటు నుంచి బయటపడితే తమ ఆరోగ్యానికి మంచిది.

Must Read:తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి.

(Visited 2,968 times, 1 visits today)