Home / Inspiring Stories / వ్యక్తిగత విషయానికి ప్రభుత్వ నిధులా??

వ్యక్తిగత విషయానికి ప్రభుత్వ నిధులా??

Author:
 ప్రముఖ మ్యాగజైన్ ‘ఔట్ లుక్’ రాష్ట్ర ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి, ఐఎఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ మీద అసభ్య కార్టూన్ తో ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. మహిళలు తలదించుకునే విధంగా మాధవి తాతా అనే జర్నలిస్టు రాసిన ఈ కథనాన్ని ఔట్ లుక్  పత్రిక ప్రచురించింది. రెండు జిల్లాల్లో నిరంతర శ్రమ చేసి, ఎన్నో కొత్త కార్యక్రమాలకు కొత్తగా శ్రీకారం చుట్టి , పేదల పాలిట పక్షపాతిగా పెరు తెచ్చుకున్నా స్మితా  కలెక్టరుగా కరీంనగర్ లో పనిచేస్తున్నప్పుడు రోడ్ల విస్తరణ, అక్రమణల తొలగింపు కోసం ఎంతగానో పాటుపడ్డారు. ఈ క్రమంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గలేదు. కరీంనగర్ కలెక్టర్ గా వైద్య ఆరోగ్య శాఖలో ఆమె చేపట్టిన సంస్కరణలు అక్కడి ప్రజలకు వైద్య సదుపాయాలను దగ్గర చేశాయి. మెదక్ కలెక్టర్ గా ఎన్నికల సమయంలో ఓటింగ్ పెంచేందుకు ప్రజలకు బహుమతులు ఇస్తామని ప్రోత్సహించి మరీ ఆమె వారి సామాజిక బాధ్యతను, ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను చాటి చెప్పారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే స్మితా సబర్వాల్ ను కేసీఆర్ తన పేషీలోకి తీసుకున్నారు.
                                         సెలబ్రిటీలకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. అయితే ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు అయితే ఫేస్ బుక్ నిండా అభిమానులే. పదుల సంఖ్యలో ఆమె పేరిట పేజీలు ఉన్నాయి. ఇందులో ఏది ఆమె అఫీషియల్ పేజీ కాదు. అన్ని అభిమానులు పెట్టుకున్నవే. ఒక పేజీలో 82 వేల మంది అభిమానులు ఉంటే ..మరో పేజీలో 78 వేల మంది, ఇంకో పేజీలో 43 వేల మంది, ఇంకో పేజీలో 35 వేల మంది, మరో పేజీలో 23 వేల మంది స్మితా సబర్వాల్ పేరు మీద ఏ పేజీ వెతికినా వేల సంఖ్యలో అభిమానులు కనిపిస్తారు. ఐదు వేల నుండి 85 వేల దాకా ఫేస్ బుక్ లో ఆమె పేజీలు దర్శనం ఇస్తున్నాయి. ఇవి కాకుండా ఇంకా ఎన్ని పేజీలు ఉన్నాయో తెలీదు కూడా. మొత్తానికి ఇంత అభిమానం చూరగొన్న ఐఏఎస్ అధికారి ఎవరూ లేరు. అలాంటి వ్యక్తిని ఔట్ లుక్ పత్రిక ఘోరంగా అవమానించింది. వేసుకున్న దుస్తుల ఆధారంగానే ఆమెలో భారతీయ స్త్రీ తనం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా అసభ్యకర దుస్తుల్లో ఆమెను ఎవ్వరూ చూడలేదు. అలా స్మితా సబర్వాల్ ఉండరు కూడా. కానీ వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది పెట్టేలా ఔట్ లుక్ కథనం వేసింది. ఈ ఔట్ లుక్ కథనం రాసింది కూడా మాధవి టాటా అనే తెలుగు మహిళ. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగి ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు  వెల్లువెత్తడం తో తన పేస్ బుక్,ట్విట్టేర్ అక్కౌంట్ లు స్మితా సబర్వాల్ స్మితా సబర్వాల్  క్లోజ్  చేసుకున్నారు. “ఒక మహిళ అయి ఉండి సాటి మహిళను ఇంత అసభ్యంగా చిత్రీకరించడం సిగ్గుచేటు. ఆమె రాసిన వార్తకు, దానికి బొమ్మ వేసిన కార్టునిస్టును ఊరికే వదలకూడదు. కోర్టు గుమ్మం ఎక్కించాల్సిందే” అని డిమాండ్లు ఊపందుకున్నాయి.  ఈ వ్యవహారం లో ఔట్ లుక్ పత్రిక నవ్వులపాలైంది కూడా. మహిళలని కించ పరుస్తూ అంత హేయమైన చర్యలకు పాల్పడ్డ ఔట్ లుక్ జర్నలిజం విలువలని దిగ జార్చిందంటూ దేశవ్యాప్తంగా పలువురు మేధావులూ, సామజిక కార్యకర్తలు  మండిపడ్డారు. ఐనా ఔట్ లుక్ యాజమాన్యం కార్టూన్ ని మాత్రం తీసేసి కథనాన్ని అలానే ఉంచేసింది. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్ ఔట్ లుక్ మీద పదికోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేశారు.
ఈ నేపథ్యంలో కోర్టు ఖర్చుల నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం రూ.15 లక్షలు విడుదల చేసింది. అయితే స్మితా సబర్వాల్ వ్యవహారం వ్యక్తిగతం అని, దీని కోసం ప్రభుత్వం డబ్బులు కేటాయించడాన్ని ప్రశ్నిస్తూ వత్సల విద్యా సాగర్ అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కోర్టులో ఈ కేసు గెలిస్తే స్మితా సబర్వాల్ ఈ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తారని, ఓడిపోతె తిరిగి ఇవ్వాలని  అందులో లేదని ఆమె పేర్కొన్నారు.
“ఐతే ఇంటికి పెద్ద ఇంట్లోని వారిని కాపాడుకోవడం ఎలాగో ..ప్రభుత్వంలో పనిచేస్తున్న ఓ అధికారి, అందులో మహిళ మీద అనాలోచితంగా అభూత కల్పనలతో వార్తలు ప్రచురించి. మానసికంగ దెబ్బతీసేలా చేసినపుడు వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కదా..!” అని ప్రశ్నిస్తున్నారు ఈ కేసుని మొదటి నుంచీ చూస్తున్న వారు. మరి ఈ విషయంలో హైకోర్టు నిర్ణయం, సూచనలు ఎలా ఉంటాయో వేచిచూడాలి.
(Visited 93 times, 1 visits today)