వరుస ఫెయిల్యూర్స్ తో కొంత కాలంగా డీలా పడ్ద నాని. భలే భలె మగాడివోయ్ తో మళ్ళీ ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. ఈ చిత్రం శుక్రవారం నాడే విడుదల అయింది. అయితే యూఎస్‌లో గురువారం నాడే పలుచోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. అప్పుడే యూఎస్ మార్కెట్‌లో ఈ చిత్రం ఏకంగా ఆరులక్షల డాలర్లు వసూల్లు సాధించిందంటున్నారు. అంటే మన కరెన్సీలో 3,98,270 రూపాయలన్నమాట. అంటే దాదాపు నాలుగుకోట్ల మార్కెట్ వచ్చేసింది. ఇటు నాని ఇక ఈ ‘భలే భలే మగాడివోయ్ ’ సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డాడు. అలా సినిమాను ప్రమోట్ చేసే సమయంలోనూ తన లైఫ్ లోని ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్, పర్సనల్ ఎక్స్ పీరియెన్స్ కూడా షేర్ చేసుకున్నాడు ఈ యంగ్ హీరో. సినిమాల్లో లిప్ లాక్ లాంటి మసాలా సీన్లు చేయాలని ఉన్నా తన భార్య అంజన కోసమే వాటి గురించి దూరంగా ఉండాలని డిసైడయినట్టు క్లారిటీ కూడ ఇచ్చాడు.
సాధారణంగా లిప్ లాక్ అంటే హీరోయిన్లు ఒప్పుకోరు గానీ హీరోలు ఎగిరి గంతేస్తారు. ఇంత వరకూ లిప్ లాక్ కి నో అన్న హీరోయిన్ లాంటి వార్తలే విన్న మనకి హీరో నానీ తను ఇక ముద్దు సీన్లు చెయ్యను అని చెప్పేసాడు. దీనికీ ఓ కారణముంది లెండి. పెళ్లి తరువాత ఆహా కళ్యాణం అనే మూవీలో నటించిన నాని… ఆ సినిమాలో తప్పని పరిస్థితిలో హీరోయిన్ తో లిప్ లాక్ చేశాడట. అయితే ఈ విషయం తెలుసుకున్న నాని భార్య అంజన ఎంతొ ఫీలయ్యారట. ఈ సినిమాను ధియేటర్ లో చూసే సమయంలోనూ ఈ సీన్ వచ్చినప్పుడు బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారట. దీంతో నాని కూడా వాళ్ళావిడని చూసి చాలనే ఫీలయ్యాడట. సినిమాల్లో ముద్దు సీన్లు కామన్, ఎంటర్టైన్ చేయడం కోసమే సినిమాలు తీస్తారు. అలాంటప్పుడు మసాలా సీన్లు కూడా ఉండటం సహజం అని అప్పటికి సర్ది చెప్పినా కానీ ఇక ముందు ఇలాంటి సీన్లు చేయకూడదు అని ఫిక్సయ్యాడట. మొత్తానికి భార్య మీద ప్రేమ తో మంచి నిర్ణయమే తీసుకున్నాడు.