అన్నదానం తో కడుపు నింపుతాడు, రక్తదానంతో ప్రాణాన్ని నిలుపుతాడు, విద్యాదానంతో అందమైన భవిష్యత్ ను ప్రసాదిస్తాడు, నా అనే వాళ్లెవ్వరూ లేని వారికి అండగా నిలబడతాడు…వారికోసమే అహర్నిషలు శ్రమిస్తాడు…వారి గెలుపులో తన ఆనందాన్ని వెతుక్కుంటాడు…. అతనే వాత్సల్యం అనే స్వచ్చంధ సంస్థను స్థాపించిన రాఘవేంద్ర. రోడ్ల మీద కార్లతో పాటు పరిగెడుతూ అడుక్కుంటున్న చిన్నపిల్లలను చూసి చలించిన రాఘవేంద్ర ఇలాంటి వారికోసం తన వంతుగా ఏదైనా చేయాలని ఫిక్స్ అయ్యారు.అనుకున్నదే తడవుగా తన ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ తో కలిసి ఓ 5 గురు పిల్లలతో 2007లో వాత్సల్యం అనే స్వచ్చంధ సంస్థను ప్రారంభించారు.
ఈ స్వచ్చంద సంస్థలో ప్రస్తుతం 40 మంది పిల్లలున్నారు. వారి చదువు, భోజనం, ఆరోగ్యం అంతా…..ఈ సంస్థే చూసుకుంటుంది. ఇప్పటి వరకు 100 మంది పిల్లలకు విద్యను అందించారు. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు ఈ స్వచ్చంద సేవా సంస్థ నిర్వాహకులు.
చాలామంది తమకు తోచిన సహాయం చేయాలనుకుంటారు..అలాంటి వారికి సరైన వేదిక “వాత్సల్యం వాలంటీర్ ఆఫర్”…ఈ సంస్థలో వాలంటీర్ గా నమోదైతే చాలు…వారే మీతో….. అంధ విద్యార్థులకు స్ర్కైబ్ గా ఎగ్జామ్ రాయడం, రక్తదాన కార్యక్రమం లాంటి సమాజ సేవ కార్యక్రమాలు చేయిస్తుంటారు. యంగ్ జనరేషన్ ఆలోచనా స్థాయి మారుతుంది. గతంలో బర్త్ డేస్ అంటే హోటల్స్, ఫ్రెండ్స్, పబ్స్, పార్టీస్ అంటూ సాగేవి…ఇప్పుడు చాలామంది తమ బర్త్ డే పార్టీలను అనాథాశ్రమాల్లో, వృద్దాశ్రమాల్లో చేసుకోడానికి మొగ్గుచూపుతున్నారు. అక్కడి వారితో కాసేపు ప్రశాంతంగా గడిపే ప్రయత్నం చేస్తున్నారు. అలా పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవాలనుకునే వారికి వాత్సల్యం ఓ మంచి వేదిక.
స్థాపకుడు & ఛైర్మన్ రాఘవేంద్ర లైన్:
నిస్సహాయులకు అండగా నిలబడడం, ఆకలితో బాధపడేవాడికి అన్నం పెట్టడం…ఇదే నాకు తెలిసిన మంచి. కోట్లకు కోట్లు సంపాదించుకోవడం కంటే ఓ నలుగురి ఉన్నతికి కారణమవ్వడమే నాకిష్టం. ఆలోచన రాగానే ఆచరణలో పెట్టడానికి ఎంతగానో సహాయపడ్డ నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ కు ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే. అలాగే సంస్థ ప్రారంభం నుండి ఆర్థిక సహాయం చేస్తున్న మిత్రులందరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సంస్థనుండి మరింత మందికి సహాయం చేయాలన్న ఆలోచన ఉంది…, కానీ ఆర్థిక వనరుల కొరత మా లక్ష్యాన్ని కాస్త నిరోదిస్తున్న పరిస్థితి.! దాతలెవరైనా తమకు తోచిన రీతిలో సహాయమందిస్తే ఇంకా మరింత మంది పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును ఇస్తామనడంలో ఎలాంటి సందేహంలేదు. వాలంటీర్ గా చేరాలనుకున్నా, సహాయసహాకారాలు అందించాలనుకున్న ఈ నెంబర్ లను సంప్రదించండి
9030924171, 9704416498.