Home / Entertainment / Video: అజ్ఞాతవాసి ఫంక్షన్ కే హైలైట్ గా నిలిచిన వీణ శ్రీవాణి గారి పెర్ఫార్మన్స్..!

Video: అజ్ఞాతవాసి ఫంక్షన్ కే హైలైట్ గా నిలిచిన వీణ శ్రీవాణి గారి పెర్ఫార్మన్స్..!

Author:

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25 వ చిత్రం “అజ్ఞాతవాసి” సినిమా ఆడియో ఈవెంట్ అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే, తెలుగులో మొదటిసారి మ్యూజిక్ చేస్తున్న అనిరుధ్ రవిచందర్ అజ్ఞాతవాసి సినిమాకి సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు, పాటలతో పాటు పవన్ కళ్యాణ్ కోసం అనిరుధ్ చేసిన స్పెషల్ వీడియో కూడా సూపర్ హిట్ అయింది, అలాగే ఆడియో ఫంక్షన్ లో అనిరుధ్ ఇచ్చిన లైవ్ పెర్ఫార్మన్స్ అదిరిపోయింది.

ఇంకా వీణ వాయించడంలో పాపులర్ అయిన వీణ శ్రీవాణి గారి పెర్ఫార్మన్స్ ఈవెంట్ కే హైలైట్ గా నిలిచింది, పవన్ కళ్యాణ్ హిట్ సాంగ్స్ కొన్నింటిని వీణతో వాయించి అభిమానులని ఉర్రుతలూగించింది. కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా, ఆది పినిశెట్టి, ఖుష్బూ, రావు రమేష్, బోమన్ ఇరానీ, మురళి శర్మ ముఖ్య పాత్రధారులుగా చేసిన అజ్ఞాతవాసి ఎన్నో అంచనాల మధ్య ఈ సంక్రాంతికి విడుదల కానుంది.

(Visited 213 times, 1 visits today)