నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు.. ఈ ముగ్గురు డిఫరెంట్ ఇమేజ్ ఉన్న తెలుగు హీరోలు. విభిన్న కథలను ఎంచుకునే ఈ ముగ్గురు ఒకే సినిమాలో కలిసి నటిస్తే అభిమానుల అంచనాల మరింత భారీగా ఉంటాయి. వీర భోగ వసంత రాయలు విషయంలో అదే జరిగింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ ముగ్గురు హీరోలతో పాటు శ్రియ, శశాంక్‌లు ప్రధాన పాత్రల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. పోస్టర్‌లతో మంచి హైప్ క్రియేట్ చేసిన వీర భోగ వసంత రాయలు తరువాత తరువాత ఆ స్థాయిలో సందడి చేయలేదు. దీంతో రిలీజ్ సమయానికి సినిమా మీద అంచనాలు పడిపోయాయి. మరి ఇలాంటి సమయంలో రిలీజ్ అయి వీర భోగ వసంత రాయలు ఏమేరకు ఆకట్టుకుంది..?
హైదరాబాద్‌లో వరుసగా కిడ్నాప్‌లు జరుగుతుంటాయి. అనాథలైన ఆడపిల్లలను కిడ్నాప్ చేస్తుంటుంది ఓ ముఠా. మరోవైపు శ్రీలంక నుంచి భారత్‌కు వస్తున్న ఓ విమానం మిస్సవుతుంది. అందులో క్రీడాకారులు, సెలబ్రిటీలు ఉంటారు. ఓ పదిహేనేళ్ల కుర్రాడు తన ఇల్లు మాయమైందని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఈ మూడింటికీ ఉన్న సంబంధం ఏంటి? దుష్టశిక్షణ చేయడానికి వచ్చిన ‘వీర భోగ వసంత రాయలు’ (శ్రీవిష్ణు) ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? వచ్చి ఏంచేశాడు? అన్నదే సినిమా కథ.
సినిమాను ఇంట్రస్టింగ్ పాయింట్‌తో స్టార్ట్ చేసిన దర్శకుడు ఆ క్యూరియాసిటీని కొనసాగించటంలో తడబడ్డాడు. మూడు భిన్నమైన కేసుల నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు ఆ కథను అనుకున్నట్టుగా తెర మీద చూపించటంలో ఫెయిల్ అయ్యాడు. చాలా సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతూ ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి. చివరి 15 నిమిషాలు ఆసక్తికరంగా ఉన్నా అవి సినిమాను ఏమేరకు కాపాడతాయో చూడాలి. ముఖ్యంగా సినిమాకు నిర్మాణ విలువలే ప్రధాన సమస్యగా మారాయి. క్వాలిటీ పరంగా సినిమా నిరాశపరుస్తుంది. కథా కథనాలు కూడా అదే స్థాయిలో ఉండటంతో వీర భోగ వసంత రాయలు ఆడియన్స్ సహనానికి పరీక్షగా మారింది. సినిమాటోగ్రఫి, సంగీతం పరవలేదనిపిస్తాయి.
ఒక దర్శకుడు చెప్పిన కథను నమ్మి నారా రోహిత్, సుధీర్‌బాబు, శ్రియ, శ్రీవిష్ణు లాంటి నటులు తమ ఇమేజ్‌ను కూడా పక్కనబెట్టి నటించడానికి ముందుకొచ్చారు. అయితే వారి శక్తిసామర్థ్యాలు దర్శకుడు సరిగ్గా వాడుకోలేదు. వీరు కాకుండా ఎవరు చేసినా ఈ పాత్రలు ఇలాగే ఉంటాయి. ఈ నటీనటుల వల్ల వచ్చిన అదనపు ప్రయోజనం ఏదీ లేదు. శ్రీవిష్ణు గెటప్ మాత్రం కాస్త విచిత్రంగా ఉంటుంది. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్‌బాబు కలిసి నటించిన ఫ్రేమ్ ఒక్కటీ ఉండదు. సినిమాలో వీరు ముగ్గురూ ఫోన్‌లో మాట్లాడుకోవడమే సరిపోయింది.సాంకేతికంగా చూస్తే ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్‌తో ముగించాలి అనుకునే రంగంలోకి దిగినట్లు అనిపిస్తుంది. టేకింగ్ పరంగా నాణ్యత లోపించింది. గ్రాఫిక్స్ కూడా నాసిరకంగానే ఉన్నాయి. పాటలకు చోటివ్వకపోవడం కాస్త ఉపశమనం కలిగిస్తుంది. మిగిలిన సాంకేతిక విభాగం ఈ కథకు బలాన్ని చేకూర్చలేకపోయాయి.
ప్లస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ :
పంచ్ లైన్: వీర భోగ వసంత రాయలు…. అర్థం చేసుకోవడం కష్టం.
రేటింగ్ : 2.5/5
గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
‘వీర భోగ వసంత రాయలు’ మూవీపై మీ అభిప్రాయం చెప్పండి ?