రాఖీ అన్నా చెల్లెల్లూ, అక్కా తమ్ముళ్ళూ ఒకరి కోసం ఒకరున్నాం అని మళ్ళీ ఒకసారి తలుచుకునే రోజు. తోడబుట్టిన వాడి క్షేమం కోరుతూ రాఖీ కడుతుంది ఆ ఇంటి ఆడ పిల్ల నిన్ను చివరి వరకూ కాపాడుకునే భాధ్యత నాదీ అని మనసులోనే అనుకుంటాడు ఆ సోదరుడు. ఏ ఆడపిల్ల రాఖీ కట్టినా ఆమెని తన సొంత సోదరిగనే భావిస్తారు. ఆడపిల్లలపై దాడులు పెరుగుతున్న ఇలాంటి సమయానికి రోజూ రాఖీ పండగ జరిపినా చాలు సగానికి పైగా నేరాలు ఆగిపోతాయ్ అంటున్నారు పెద్దలు. ఐతే రాఖీ కుటుంబం లోనూ సమాజం లోనూ మాత్రమే కాదు సినిమాల్లోనూ ప్రత్యేక పాత్రే పోషించింది. తమ చెల్లెల్ల కోసం మూటలకొద్దీ కష్టాలు మోసిన అన్నలూ, బకెట్ల కొద్దీ కన్నీళ్ళు కార్చిన అక్కలూ, చెల్లెల్లూ నిర్మాతలని కూడా కొన్ని సార్లు ఏడిపించినా మరికొన్ని సార్లు మాత్రం కాసుల వర్షమే కురిపించారు. పాత సినిమాల్లో రక్త సంబందం, చిట్టి చెల్లెలు లాంటి సినిమాలు అప్పటి ప్రేక్షకుల పై అద్బుతమైన ముద్ర వేసాయ్. ఐతే ఇంకా చాలామంది అన్నయ్యలూ తమ్ముళ్ళూ మన సినిమాల్లో కనిపిస్తారు ఒకసారి ఈ సినిమా సోదరులపై ఒక లుక్.
ఈ అన్న మన సినిమాల్లో సర్వ సాధారణం అన్న మాట అంటే చిన్నప్పుడే చెల్లెలి ఆడుకుంటూ ఏ ముళ్ళు మీదో కాలెయ్యబోయిందా పరుగెత్తుకెళ్ళి మరీ ఆ ముళ్ళు మీద చెయ్యేసి చెల్లెలి కాలు కసుక్కున చేతిమీద పడ్డా ఆనందంగా భరిస్తాడు.ఆ మ్మాయి నిద్ర పోతూంటే విసన కర్ర విసురుతాదు.కష్టపడి పేపరెయ్యటం,సకిల్ షాపులో గాలికొట్టటం లాంటి పార్ట్ టైం జాబులు చేసి ఆ అమ్మాయిని చదివిస్తూంటాడు.కాస్త పెద్దయ్యాక ఆ పిల్ల కాలేజీకెల్తూంటే ఎవడైనా కామెంట్ చేసాడా ఇక వాడు ఈ అన్న చేతిలో ఐపోయాడే.అంత అపురూపంగా చూసుకుంటాడు తన చెల్లెలిని. కానీపాపం ఇలాంటి అన్నలకు సెకెండాఫ్ లో భారీ షాక్ తగులుతుంది, ఆ అమ్మాయిని ఏ విలనో రేప్ చేస్తాడు, హీరో విరోధి ఇంటికే కోడలుగా తీస్కెళ్ళి అష్ట కష్టాలూ పెడతాడు.ఈ భాదలు చూడలేక ఆ దరిద్రున్ని తాన్నటానికి ఈ అన్నయ్య వచ్చాడా ఇక అంతే “నా భర్తని కొట్టటానికి నువ్వెవడివి?” అంటూ తన ప్రాథమిక హక్కుని గురించి ప్రశ్నిస్తుంది. దాంతో అన్న ఒక విశాద గీతం పాడుకుంటూ భూత్ బంగ్లాల పక్కనా, ఊరవతలి చెరువు గట్టు మీదా తిరుగుతాడు. చివర్లో ముగింపులు కూడా ఒక్కోసారి ఈ అన్నా చెల్లెల్లని కలప లేవు. అల్లున్ని చేతిలో పెట్టి చచ్చిపోతుందా చెల్లెలు.. హీరోఏడుస్తూ ప్రేక్షకులనేడిపిస్తాడు. ప్రేక్షకులు ఏడుస్తూ నిర్మాతని నవ్విస్తారు.
సాధారణంగా ఇలాంటి అన్నలు హీరోలవరు పాపం ఎక్కడో మూలన తాగుతూనో లేదంటే పేకాడుతూనో జీవితం గడుపుతూంటారు ఎప్పుడో పేకాటకి డబ్బులు చాలకపోతే జనజీవన స్రవంతిలోకి వచ్చి సినిమాలో హీరోయిన్ అయిన అక్కనో,చెల్లినో డబ్బుల కోసం వేధిస్తారు, ఆ దబ్బులు పడేసాక ఊర్కుంటారా అంటే అబ్బే లేదే హీరో తో గోడవా విలన్ దగ్గ ర అప్పూ రెండూ చేసి ఆడెడ్ అట్రాక్షను గా “నాచెల్లి పెళ్ళి నీతోనే బావా” అంటూ విలన్ కి మాటిచ్చేస్తాడు. చివర్లో చెల్లి చేతిలో తిట్లకో,హీరో తన్నులకో గానీ మారిపోయి క్లీన్ షేవ్ చేస్కొని శుభం కార్డు ఫొటోలొ పగల బడి నవ్వుతూ ఫోజిస్తాడు.
కామెడీ అన్న: ఈ టైపు అన్నలు ఎక్కువగా హేరోకి ఫ్రెండ్స్ ఐ ఉంటారు ఏ బడ్డీ కొట్టు దగ్గరో తన లానే ఆవారాగాతిరిగే ఇంకొంతమంది బ్యాచ్ తో కలిసి అమ్మాయిలనేడిపించటం, తన ప్రేమించో అంటూ తన చెల్లెలి వెనకే పడి ఆ పిల్లని కాల్చుకు తినే హీరోకి నాలుగు తగిలించక పోగా ఎంకరేజ్ చేస్తాడు కూడా. ఇంట్లో చెల్లికి పెల్లి సంబందం వచ్చిందా “నాన్నా దుర్గకీ సంబందం ఇష్టం లేదు తను నా స్నేహితున్ని ప్రేమిస్తోంది” అని గంభీరంగా చెప్పి తండ్రి తో బూతులు తిట్టించుకుంటాడు.
ఈ అన్నలు మన సినిమాల్లో అరుదుగా కనిపిస్తారు. పెదరాయుడు లాగా పడక్కుర్చీలో కూర్చొని చుట్ట కాలుస్తూ మధ్య మధ్య లో ” గిది ఫైనల్ ” అనో లేదా “నరకండ్రా వాన్ని” అనో అరుస్తూంటాడు. మామూలుగానే ఈ టైపు అన్నలకి చెల్లెలిని ప్రేమించిన హీరో అంటే నచ్చదు. హీరో ఇంటికే వచ్చి తనని వీపీ ని చేసి ఆడుకుంటున్నా అందర్నీ హడలగొట్టే ఆ అన్నకి అర్థం కాదు. చివరికి ఒక ఫైట్లో తన్నులు తిన్నాకో లేదా హీరో తనని కాపాడినందుకో కన్విన్స్ ఐపోయి వాల్ల పెళ్ళి చేసి గంభీరంగా మళ్ళీ పడక్కుర్చీలో కూర్చుంటాడు.
ఇంతే కాదు చెల్లిపెళ్లి చేయలేక కుమిలి పోయే మధ్య తరగతి అన్నలూ, అక్క క్షేమం కోసం తన జీవితన్నే త్యాగం చేసే తమ్ముళ్ళూ, అత్తారింట్లో కష్టాలు పడ్తున్న తమ సోదరి కోసం తపించే సోదరులూ, చెల్లికి కష్టం వచ్చిందనగానే సిటీలో ఉన్న చెడ్డవాళ్ళందర్నీ నరికేసే అన్నలూ, తోబుట్టువు కి జరిగిన అన్యాయానికి చలించి అన్యాయం జరిగిన ఆడపిల్లలందరికీ అండగా ఉండే సోదరులూ తెలుగు తెరకి ఎన్నో హిట్లనీ నిర్మాతలని లాభాలనీ తెచ్చి పెట్టారు. హాట్సాఫ్ టూ దెం, హాట్సాఫ్ టూ తెలుగు వెండి తెర. అందరికీ రాఖీ శుభా కాంక్షలు.