Home / Entertainment / వెంక‌టేష్ త‌న కూతురి పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ .!

వెంక‌టేష్ త‌న కూతురి పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ .!

Author:

హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి వివాహ వేడుక‌ని వైభవంగా జ‌ర‌ప‌నున్న‌ట్టు తెలుస్తోంది.హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు ఆష్రిటా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని రీసెంట్‌గా త‌న కుటుంబ స‌భ్యుల‌కి చెప్ప‌డంతో వారు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

వెంక‌టేష్ సోద‌రుడు సురేష్ బాబు ఇప్ప‌టికే అబ్బాయి ఇంటికి వెళ్లి మాట్లాడి వచ్చార‌ని… త్వ‌ర‌లో వీరిరివురి నిశ్చితార్దం జ‌ర‌గ‌నుంద‌నే వార్త సోష‌ల్ మీడియాలో షికారు చేస్తోంది. మరి ఆశ్రిత ప్రేమ పెళ్లి విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కు వెంకీ కుటుంబ స‌భ్యులు ఎవ‌రు స్పందించ‌కపోగా, ఇంత‌లో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

Venkatesh-Daughter

వెంకటేష్ కు ఒక కుమారుడు అర్జున్, కూతురు ఆశ్రిత ఉన్నారు. కూతురు ఆశ్రిత బేకరి రంగంలో వృత్తి నిపుణురాలిగా ట్రైనింగ్ తీసుకుంది.

(Visited 1 times, 1 visits today)