Home / Political / వెంకయ్య నాయుడు శ్రీమంతుడు కాదు…!

వెంకయ్య నాయుడు శ్రీమంతుడు కాదు…!

Author:

ఈ మధ్య వెంకయ్య నాయుడు శ్రీమంతుడు సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా? “శ్రీమంతుడు తనకు బాగా నచ్చాడనీ తన కథనే చూసుకున్నట్టనిపించిందనీ” వెంకయ్య నాయుడు అన్న మాటలకు రాజకీయ విశ్లేష్కుకులు కొత్త అర్థం చెప్పి నవ్వుకుంటున్నారు. వెంకయ్య నాయుడు కథే కానీ అందులో ఆయనది జగపథి బాబు పాత్ర అనీ,ఊరిని వదిలి పోయాక ఏదో చేద్దామనుకుంటూనే ఏమీ చేయలేక లావైపోయారనీ అంటున్నారు కొందరు.

శ్రీమంతుడి సినిమాలో జగపతిబాబుకు తన ఊరు అంటే వల్లమాలిన అభిమానం. ప్రేమ. దానిని అభివృద్ధి చేయాలని అనుకుంటాడు. చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ స్థానిక రాజకీయాల కారణంగా ఆయనకు ఎదురు దెబ్బ తగులుతుంది. దానిని తట్టుకోలేక ఆయన ఊరు ప్రజలను తప్పుబట్టి ఊరు వదిలి వెళ్లిపోతాడు. ఊరు వదిలి వెళ్లిపోయి వేల కోట్లకు అధిపతి అవుతాడు. అచ్చం ఇలానే వెంకయ్య నాయుడు కూడా జై ఆంధ్రా ఉధ్యమం లో కీలక పాత్రా పోషించారు. ఆతర్వాత నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి పోటీ చేసి ఒకసారి అసెంబ్లీకి కూడా వెళ్లిన వెంకయ్య నాయుడు . జైపాల్ రెడ్డి వంటి వారితో కలిసాక అద్బుతమైన వాగ్ధాటితో ప్రతిపక్షాలని ఇరుకునపెట్టేవాళ్ళు. కానీ రెండో సారి మాత్రం ఆయన మళ్ళీ ఉదయగిరి నుంచి గెలవలేకపోయారు. అక్కడి రెడ్డి రాజకీయాలని ఎదుర్కోలేని వెంకయ్య నాయుడు తర్వాత నెల్లూరు తన కంచుకోట అని చెప్పుకోవటం తప్ప ఎప్పుడూ అక్కడ ప్రత్యక్షంగా పోటీ చేసే సాహసం చేయలేదు. నెల్లూరులోనే కాదు ఆంధ్రప్రదేశ్ లోని ఎక్కడా ప్రత్యక్ష ఎన్నికల్లోకి ఇటు పార్లమెంటు అటు అసెంబ్లీకి పోటీ చేయలేదు కూడా. అయితే అప్పట్లో బీజేపీ కర్ణాటకలో అధికారంలో ఉండేది. కనక అక్కడి నుంచి ఆయనను రాజ్యసభకు పంపించింది. ఆ తర్వాత కూడా ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది కనక అప్పటి నుంచి ఇప్పటి వరకు కర్ణాటక నుంచే ఆయన రాజ్యసభకు వెళ్లారు. వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ కు చెందినా బీజేపీకి ఇక్కడ సరైన పట్టు లేదు కనక ఆయనకు రాజ్యసభ సభ్యత్వం తెలుగు రాష్ట్రం నుంచి దక్కలేదు. దాంతో తాను ఎంతో గొప్ప నాయకుడిని అయినా, తాను బీజేపీ జాతీయ అధ్యక్షుడిని అయినా,  రెండుసార్లు కేంద్ర మంత్రి అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనను ఎప్పుడూ ఆదరించలేదనేది వెంకయ్య నాయుడు ఆరోపణ. ఇప్పుడు నేను కూడా వేల కోట్ల రూపాయలకు అధిపతిని అయ్యానని అయినా సొంత రాష్ట్రం తనను ఆదరించడం లేదని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయన శ్రీమంతుడు సినిమాలో మహేశ్ బాబు కాదని జగపతి బాబు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే స్వర్ణ భారతి అనే ట్రస్టును పెట్టి సొంత ఊరికి ఏదో చేస్తున్నానని చెబుతున్నా అది కేవలం రాజకీయాల కోసమేనని దాని పనితీరు అంతంతమాత్రమే అనే అపవాదూ ఉంది.

ఆయనకి తెలుగు రాష్ట్రాల మీదా తెలుగు ప్రజలమీదా ఉన్న అక్కసు స్మార్ట్ సిటీల ఎంపిక లోనే స్పష్టమౌతొందంటున్నారు. ఆంద్రప్రదేష్ లో మూడూ తెలంగాణాలో రెండు పట్టణాలూ కలిపి రెండు రాష్ట్రా తెలుగు రాష్ట్రాలలో కలిపి ఐదు పట్టణాలను మాత్రమే ఎంపిక చేసిన వెంకయ్య నాయుడు . తన ఆస్తులున్న తమిళనాడులో మాత్రం ఏకంగా 12 నగరాలను ఎంపిక చేశారు. బీజేపీ ప్రతిపక్షంగా ఉన్న కర్ణాటకలో కూడా ఆరు నగరాలను స్మార్ట్ సిటీ లిస్ట్ లో చేర్చారు.  కనీసం ఆయన సొంత జిల్లా నెల్లూరును కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే నెల్లూరును కూడా ఆయన స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చలేదు. ఇంత పక్షపాత ధోరణి ఉన్న వెంకయ్య నాయుడు శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు కాదూ ఏమీ చేయలేక పోయిన జగపతి బాబు అనీ కొన్ని జోకులు సోషల్ మీడియ లో కూడా కనిపించాయి.

(Visited 188 times, 1 visits today)