Home / health / ఎత్తు పెంచుకునే ఆపరేషన్ చేయించుకొని తప్పు చేశాను అంటున్న నిఖిల్ రెడ్డి.

ఎత్తు పెంచుకునే ఆపరేషన్ చేయించుకొని తప్పు చేశాను అంటున్న నిఖిల్ రెడ్డి.

Author:

Height Operation Hyderabad

టెన్త్‌లో ఫస్ట్‌క్లాస్‌లో పాసైన నిఖిల్ ఇంటర్, ఇంజనీరింగ్‌లో డిస్టింక్షన్ సాధించాడు. నగర శివారులోని ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్‌లోనే నిఖిల్ రూపొందించిన ‘నోటీస్‌బోర్డ్’ కంప్యూటర్ అప్లికేషన్ ఎంతో పాపులర్ అయింది. సెయింట్‌మార్టిన్ సహా సీబీఐటీ సైతం నిఖిల్ రూపొందించిన అప్లికేషన్‌తోనే విద్యార్థుల హాజరు, ఫలితాల వివరాలను అనుసంధానం చేసేసింది. ఇవి కాకుండా తన సీనియర్స్, జూనియర్స్ కోసం సుమారు 16 అప్లికేషన్స్‌ను నిఖిల్ రూపొందించారు.కానీ ఎత్తు కొంచం తక్కువ అన్న ఇంఫియారిటీ కాంప్లెక్స్ ని మాత్రం జయించలేక పోయాడు.. ఎత్తు పేరగటం కోసం అరుదైన ఆపరేషన్ చేయించుకొని వార్తల్లోకి ఎక్కిన నిఖిల్ ఇప్పుడు తల్లితండ్రులకు చెప్పకుండా చేయించుకున్న ఆపరేషన్ వల్ల ఇబ్బందులు పడుతూ విచారిస్తున్నాడు… ఒక ప్రముఖ దిన పత్రిక కి ఇచ్చ్జిన ఇంటర్వ్యూ లో చెప్పిన వివరాలు అతని మాటల్లోనే….

Height Operation Hyderabad 1

“మా ఇంజినీరింగ్ క్లాస్‌లో మొత్తం 30 మంది స్టూడెంట్స్. అందులో ముగ్గురమే 5.7 అడుగుల కంటే తక్కువ ఎత్తు ఉండేటోళ్లం. అందుకే నేనూ మిగిలిన వాళ్లలా రెండు మూడు ఇంచ్‌లు పెరిగేందుకే శస్త్రచికిత్సతో సాహసం చేశా. ఈ చికిత్స విషయాన్ని నా తల్లితండ్రుల వద్ద దాచి తప్పే చేశా. అయితే డాక్టర్లు రెండు రోజుల్లో డిశ్చార్జి, వారం రోజుల్లో వాకర్ సహాయంతో నడవొచ్చని చెప్పారు. కానీ పది రోజులవుతున్నా కనీసం పూర్తిగా కూర్చోలేకపోతున్నా’ అంటూ ఏప్రిల్ 5న గ్లోబల్ ఆస్పత్రిలో ఎత్తు పెరిగేందుకు రెండు కాళ్లకూ శస్త్రచికిత్స చేయించుకున్న తరవాత తన మానసిక పరిస్థితిని చెప్పుకొచ్చాడు…

Height Operation Hyderabad 1

ఎత్తు పెరిగే వైద్యం కోసం ఆన్‌లైన్‌లో ఏడాది పాటు ఇంటర్నెట్లో సెర్చ్ చేశాడట. చివరకు రష్యా, చైనాలో ‘ఇల్‌జర్వ్’ ప్రక్రియతో ఎత్తు పెంచే (లింబ్ లెంగ్తెనింగ్) ఆపరేషన్స్‌ను పరిశీలించి. ఆపై మిత్రులతో కలసి గ్లోబల్ ఆస్పత్రిని సంప్రదించారు. గతంలో మేం ఎత్తు పెంచేందుకు చేసిన శస్త్ర చికిత్సలు పూర్తి సక్సెస్ అయ్యాయని ఇక్కడి వైద్యులు చెప్పటం తో ఆపరేషన్ కి రెడీ అయ్యాడు. శస్త్రచికిత్సకు తొలుత రూ.2.5 లక్షలని చెప్పి.. చివరకు రూ.3 లక్షలు అన్నారు. 2.5-3 ఇంచుల ఎత్తు పెంచేందుకు పూర్తి శాస్త్రీయ పద్ధతిలో శస్త్రచికిత్స చేస్తామన్నారు. నాలుగైదు మాసాల్లో పూర్తిగా కోలుకోవచ్చన్నారు. అదే ధీమాతో జనవరి 23 నా 22వ పుట్టినరోజు నాడు గ్లోబల్ ఆస్పత్రికి వచ్చి లక్ష రూపాయల ఫీజు అడ్వాన్స్‌గా చెల్లించాడు.

అమ్మానాన్నలకు చెబితే వద్దంటారనే వారికి చెప్పకుండా మిత్రులతో కలసి ఆస్పత్రిలో చేరాడు. నేను మేజర్ అవ్వడంతో అమ్మానాన్నలు ఎక్కడని ఆస్పత్రివారు అడగలేదు. తన ఆపరేషన్ కోసం డబ్బు సమకూర్చుకోవటానికి కూడా నిఖిల్ చాలా కష్టపడ్డాడు తాను పనిచేసే కంప్యూటర్ సంస్థలో వచ్చే జీతం మొత్తాన్ని ఇంట్లోనే ఇచ్చేసే నిఖిల్. శస్త్రచికిత్సకు అవసరమయ్యే డబ్బు కోసం రాత్రిళ్లు పనిచేసి వివిధ రకాల కంప్యూటర్ అప్లికేషన్లు రూపొందించాడట. ఆ డబ్బుతోనే ఈ ఆపరేషన్ కోసం ఫీజు చెల్లించాడు. ఏప్రిల్ 5న ఆరు గంటల పాటు శస్త్రచికిత్స చేశారు. ఇప్పటికే పది రోజులవుతోంది. కాళ్లలో మంటలు, బొబ్బలు వస్తున్నాయి. వారం రోజుల్లో నార్మల్ అయిపోతుందని డాక్టర్లు చెప్పారు కానీ ఇంకా కనీసం మంచం మీద లేచికూర్చోవటం కూదా సాధ్యం కావటం లేదు.

Height Operation Hyderabad 1

ఆత్మ విశ్వాసం కోసం ఎత్తు కావాలనుకున్నాడు కానీ ఇప్పుడు అతని పరిస్థితి మరీ ఇబ్బందిగా మారింది… “మా అన్నయ్య ఇప్పటికే సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టారు. నేనూ సొంతంగా కంపెనీ పెట్టి హుందాగా ఎదగాలన్నదే లక్ష్యం. కాలేజీ రోజుల్లోనే నేను రూపొందించిన వివిధ అప్లికేషన్లకు మంచి డిమాండ్ వచ్చింది. కానీ ఇప్పుడు చూడాలి. దేవుడు ఏం చేస్తాడో!” అంటూ నిరాశలో కూరుకు పోతున్నాడు.

అయితే నిఖిల్ తండ్రి మాత్రం ఇంకా గ్లోబల్ ఆసుపత్రి వర్గాల మీద కోపంగానే ఉన్నారు. డబ్బుకోసం నిఖిల్ భవిశ్యత్తు తో ఆడుకున్నారనీ… ఇప్పుడు ఈ ఇంఫెక్షన్ లు చూస్తూంటే భయంగా ఉందనీ ఆయన అన్నారు..‘ఉగాది రోజునే మా వాడిని డిశ్చార్జి చేస్తామన్నారు. కానీ నిన్నటి నుంచి కాళ్లపై బొబ్బలు వచ్చాయి. విపరీతమైన మంటలు, నొప్పులు వస్తున్నాయి. కదల్లేకపోతున్నాడు. నా కుమారుడి విషయంలో పూర్తి అనైతికంగా వ్యవహరించిన వైద్యులు, ఆస్పత్రిపై కేసు పెట్టాం. త్వరలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్‌కూ ఫిర్యాదు చేస్తాం.” అంటూ చెప్పారు…

Height Operation Hyderabad 1

కేవలం మూడు ఇంచ్ ల పొడవు కోసం ఆత్మన్యూనతని జయించటానికి తాను తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని ఏ మలుపుతెస్తుందో తెలియని నిఖిల్..ఒకప్పుడు సాఫ్ట్ వేర్ రంగం లో తనకంటూ ఒక గుర్తింపు ఉన్న రోజులని తలచుకుంటున్నాడు.

Must Read:పాకిస్తాన్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భారత సైంటిస్టులు.

(Visited 7,140 times, 1 visits today)