Home / Entertainment / విద్య బాలన్ ఇప్పటి దాకా అది చూపించలేదు

విద్య బాలన్ ఇప్పటి దాకా అది చూపించలేదు

Author:

” విద్య బాలన్  లో ఒక వైల్డ్ నెస్ ఉంది. ఆమెలో ఉన్న మరో కోణాన్ని ఇప్పటివరకూఎవరూ గుర్తించలేదు. తను ఇప్పటివరకూ సాఫ్ట్ గా ఉన్న పాత్రలే చేసారు తప్ప తన లోని సీరియస్ కోణాన్ని ఆమె ఇప్పటి దాక చూపించలేదు. ఈ పాత్ర లో ఆమెని తప్ప నేను మరెవర్నీ ఊహించుకోలేకపోయాను. ఈ నెగెటివ్ పాత్ర కి విధ్య ఐతేనే సరైన న్యాయం చేయగలదనిపించింది.వెంటనే ఆమె ని కలిసాను ” మెత్తని అందాలతో మత్తెక్కించే ఈ డర్టీ పిక్చర్ భామ గురించి ఈ మాటలన్నది తమిళ దర్శకుడు దురై సెంథిల్ కుమార్. విద్య బాలన్ ని ఇప్పటివరకూ ఎవరూ చూపించని విధంగా తాను చూపిస్తానని. తాము చేయబోయే సినిమా రెండు భాషల్లోనూ సూపర్ హిట్ ఔతుందనీ ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.

ఇంతకీ ఈ సినిమాలో విద్య బాలన్ హీరోయిన్ కాదు విలన్. ఔను విద్య బాలన్ ఒక పవర్ ఫుల్ లేడీ విలన్ గా కనిపించబోతోంది. హీరో ధనుష్ తో రాజకీయాల్లో తలపడే ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయబోవటం మాత్రమే కాక, దురై చెప్పిన ఆ స్టోరీ లైన్ కూడా  విద్య బాలన్ కి కూడా పిచ్చ పిచ్చగా నచ్చేసిందట. వెంటనే ఒప్పేసుకొని ఆ పాత్రలో ఇన్వాల్వ్ అవటానికి తనదైన శైలి లో ప్రాక్టీస్ కూడా మోదలు పెట్టిందట. ఆధునిక రాజకీయ వ్యవహారాల చుట్టూ తిరిగే ఈ కథని మంచి పొలిటికల్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుత సమాజం లోని కొన్ని నిజజీవిత పాత్రలకనుగుణంగా కథని తయారు చేసుకున్నారట. దాంతో తన పాత్రలో ఇమిడిపోయేందుకని ఇప్పటి వరకూ ఉన్న లేడీ పొలిటికల్ లీడర్ల ఉపన్యాసాల వీడియోలు తెప్పించుకొని. వారి హావ భావాలు, మాటల తీరూ అనుకరించటానికీ, పెద్ద పొలిటికల్ వుమెన్ గా ఒక ప్రత్యేక బాడీ లాంగ్వేజ్ కోసం. ఒక ఇన్స్ట్రక్టర్న్ ని కూడా నియమించుకుందట. అన్నిటికంటే ముఖ్యంగా ఈ పాత్రకోసం 10 కేజీ లవరకూ బరువు కూడా పెరగనుందట ఇప్పటికే బొద్దు గా కనిపించే  ఈ ముద్దు భామ..

ఇప్పుడిప్పుడే బాలివుడ్ లోకి ఎంటరౌతున్న ధనుష్ కూడా రెగ్యులర్ లవ్ స్టోరీలు కాకుండా. నటనకి స్కోప్ ఎక్కువుండే పాత్రలు చేసి మామూలుగా దక్షిణాది హీరోయిన్లను తప్ప హీరోలని ఇష్టపడని హిందీ ప్రేక్షకులను ఆకట్టు కోవాలని చూస్తున్నాడు. అదే బాటలో “రాంజనా, షమితాబ్ …’ తదితర చిత్రలలో మంచి మార్కులే కొట్టాడు. ఇపుడీ సినిమా గనక లో హిట్ ఐతే ఇక బాలీవుడ్ లో  తన స్థానం పదిలం ఐపోయినట్టే అనుకుంటున్నాడు. ఒక రకంగా విద్య బాలన్ వల్ల బాలీవుడ్ వెర్షన్ కీ ఢోకా ఉండదు. దాంతో ధనుష్ కూడా ఈ సిని మాని సీరియస్ గానే తీస్కున్నాడు. బహుభాషా చిత్రంగా రాబొతున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ నిర్ణయించ లేదు. సినిమాని వీలైనంత త్వరగా మొదలు పెట్టటానికేప్రయత్నిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారు దురై సెంథిల్ కుమార్.

(Visited 45 times, 1 visits today)