Home / Latest Alajadi / లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఆరెస్ట్.

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఆరెస్ట్.

Author:

బ్యాంకుల నుండి వేల కోట్ల రుణాలు తీసుకోని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టి సంవత్సరం కింద లండన్ కి పారిపోయిన కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాని ఎట్టకేలకు అరెస్ట్ చేసారు, ఇంగ్లాండ్ ప్రభుత్వానికి..మన సీబీఐ, ఈడీ , కేంద్ర ప్రభుత్వం నుంచి పదే పదే వెళ్లిన డిమాండ్ల క్రమంలో ఇంగ్లాండ్ పోలీసులు విజయ్ మాల్యాని అరెస్ట్ చేసారు. ఇప్పటికే నాలుగు సార్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లండన్ లోని మాల్యాకు సమన్లు పంపించింది. అయినా సమాధానం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే సీబీఐ, ఈడీ బ్రిటన్ గవర్నమెంట్ పై ఒత్తిడి తెచ్చింది. ఇండియాలోని బ్యాంకులకు దాదాపు 9వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి.. లండన్ పారిపోయాడు మాల్యా. విజయ్ మాల్యాకి చెందిన పాస్ పోర్ట్ , వీసా లని భారత ప్రభుత్వం రద్దు చేసింది, మాల్యాకి చెందిన కొన్ని ఆస్తులని కూడా వేలానికి పెట్టారు.

vijay mallya arrested in london

భారత ప్రభుత్వం, ఇంగ్లాండ్ ప్రభుత్వం మధ్య ఉన్న ఇచ్చిపుచ్చుకునే ఒప్పందాల ప్రకారం విజయ్ మాల్యాని ఆరెస్ట్ చేసి భారత దేశానికి పంపించనున్నారు, మాల్యా దేశం విడిచి పారిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేక విమర్శలని ఎదుర్కొంది, ఎన్నో సార్లు మాల్యా అరెస్ట్ కి ప్రయత్నం చేసినప్పటికీ అవన్నీ విఫలం అయ్యాయి, ఇంగ్లాండ్ ప్రభుత్వంతో MLAT TREATY ACT అనే ఒప్పందం కేంద్ర ప్రభుత్వం చేసుకోవడం వల్ల విజయ్ మాల్యా ఆరెస్ట్ సాధ్యమైంది.

విజయ్ మాల్యా ఎగ్గొట్టిన రుణాల వివరాలు:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : రూ. 1600 కోట్లు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ : రూ. 800 కోట్లు

ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అండ్ రీసెర్చరల్ బ్యాంక్ : రూ. 800 కోట్లు

బ్యాంక్ ఆఫ్ ఇండియా : రూ. 650 కోట్లు

బ్యాంక్ ఆఫ్ బరోడా : రూ. 550 కోట్లు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : రూ. 430 కోట్లు

UCO బ్యాంక్ : రూ. 320 కోట్లు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : రూ. 410 కోట్లు

కో-ఆపరేటివ్ బ్యాంక్ : రూ. 310 కోట్లు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ : రూ. 150 కోట్లు

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ : రూ. 140 కోట్లు

ఫెడరల్ బ్యాంక్ : రూ.90 కోట్లు

పంజాబ్ నేషనల్ అండ్ సింధ్ బ్యాంక్ : రూ. 60 కోట్లు

యాక్సిస్ బ్యాంక్ : రూ. 50 కోట్లు

(Visited 709 times, 1 visits today)