Home / Inspiring Stories / ఎక్కాల్సిన రైలు మిస్ అయినా, అదే మార్గంలో వెళ్లే వేరే రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చు.

ఎక్కాల్సిన రైలు మిస్ అయినా, అదే మార్గంలో వెళ్లే వేరే రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చు.

Author:

రైలులో సీటు రిజర్వ్ చేసుకోవాలంటే ఎంత ముందు జాగ్రత్తగా ఉండాలో అందరికి తెలిసిందే, ప్రపంచంలో ఎక్కువ రైళ్ళు మనదేశంలోనే నడుస్తున్న మన జనాభాకు అవి ఏమాత్రం సరిపోవడం లేవు. ముందుగా బుక్ చేసుకున్న దురదృష్టం కొద్దీ టికెట్ కన్ ఫర్మ్ అవక వెయిటింగ్ లిస్ట్ ఉంటే చివరి రోజు వరకు టికెట్ కన్ ఫర్మ్ అవుతుందో లేదో అని పెద్ద టెన్షన్. కర్మ కొద్ది బెర్త్ దొరకకపోతే అన్ని ప్లాన్ చేసుకున్న ట్రిప్ క్యాన్సెల్ చేసుకోవాల్సిందే. ఇలాంటి బాధల నుండి ప్రయాణికులను రక్షించడానికి భారతీయ రైల్వే శాఖ నడుం బిగించింది. దీనికోసం వికల్ప్ అనే కొత్త పధకాన్ని ప్రకటించింది భారతీయ రైల్వే. ఆ పధకం గురించి క్రింద చదవండి.

vikalp scheme in trains

ఒకవైపు కొన్ని రైళ్ళలో వెయిటింగ్ లిస్ట్ బారేడు ఉంటే అదే రూట్ లో వెళుతున్న కొన్ని రైళ్ళలో బెర్తులు ఖాలీగా ఉండటాన్ని గుర్తించిన రైల్వే వారు ఆ బెర్తులను వేరే రైలులో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్రయాణికులకు వికల్ప్ పధకం ప్రకారం కేటాయించనున్నారు. అంతే కాకుండా వికల్ప్ పధకం ద్వార మీకు బెర్త్ కన్ ఫర్మ్ అయి, కొన్ని అనివార్య కారణాల వలన మీరు ఎక్కాల్సిన రైలు ఎక్కలేకపోతే అదే టికెట్ తో అదే రూట్ లో నడిచే ఇంకో రైలులో ప్రయానించవచ్చు. ఈ పధకానికి ఉపయోగించుకోవాలంటే మీరు టికెట్ బుక్ చేసుకుంటున్న సమయంలో వికల్ప్ ఆప్షన్ ని ఎంచుకోవాలి, ఈ సదుపాయానికి అదనంగా ఎటువంటి రుసుము వసూలుచేయరు. అంతే కాకుండా మెయిల్, ఎక్స్‌ప్రెస్‌ లాంటి సాధారణ రైళ్లలో టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులు కూడా ఎటువంటి ఎక్కువ రుసుము చెల్లించకుండ రాజధాని, శతాబ్ది రైళ్లలో ప్రయాణించే అవకాశం పొందుతారు. ఇంకెందుకు ఆలస్యం ఏప్రిల్ 1 నుండి రైలు బుక్ చేసుకునేటప్పుడు వికల్ప్ సదుపాయాన్ని ఉపయోగించుకోండి.

(Visited 7,177 times, 1 visits today)