Home / Inspiring Stories / ఇంత అవినీతా..? 50 లక్షల పనికి 58 కోట్లు ఖర్చు అవుతాయని లెక్క కట్టిన ప్రభుత్వం.

ఇంత అవినీతా..? 50 లక్షల పనికి 58 కోట్లు ఖర్చు అవుతాయని లెక్క కట్టిన ప్రభుత్వం.

Author:

ఎలక్షన్స్ వచ్చినప్పుడు హామీల వర్షాన్ని కురిపిస్తారు, అదే ఎలక్షన్స్ అయిపోయాక ఊరి మొహం కూడ చూడరు, ఇది మన దేశంలో ప్రతి ప్రాంతంలో ఉన్న పరిస్థితి, రాజకీయ నాయకుల చేతిలో మోసపోవడం అనేది మన దేశ ప్రజలకి అలవాటు అయిపోయిన విషయం, ఇలాంటి పరిస్థితే జార్ఖండ్ రాష్ట్రంలోని ఒక ఊరి ప్రజలకి వచ్చింది, వారి ఊరికి రోడ్డు సౌకర్యం కోసం 20 సంవత్సరాల నుండి రాజకీయ నాయకుల చేతిలో మోసపోతూనే ఉన్నారు, ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి వాళ్ళ ఊరికి రోడ్డు ఖచ్చితంగా వేస్తామనే హామీ ప్రతి రాజకీయ నాయకుడు ఇచ్చేవాడు, అది నమ్మి వారు ఓటు వేసేవారు, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేవరకు ఆ నాయకుడు కనపడక పోయేవాడు, ఇదంతా జార్ఖండ్ రాష్ట్రంలోని హాజరీభాగ్ జిల్లాలో ఉన్న లరహి అనే గ్రామానికి సంభందించిన స్టోరీ.

ఇప్పటికే సరైన రోడ్డు లేకపోవడం వల్ల ఆ ఊర్లో చాలా మంది చనిపోయారు కూడ, 1996 నుండి వారు ఎంతమందికి విన్నవించుకున్నా ఏ ప్రభుత్వం రోడ్డు వేయకపోవడంతో ఆ ఊరి వారే సొంతంగా రోడ్డు వేసుకోవాలని నిర్ణయం తీసుకొని పని మొదలు పెట్టారు, ఎవరి సహాయం లేకుండా 2 నెలలు కష్టపడి 1.5 కిలోమీటర్ల రోడ్డుని వారే నిర్మించుకున్నారు, మధ్యలో ఒక బ్రిడ్జిని కూడ కట్టారు, ఆ రోడ్డు వేసుకోవడం వల్ల ఆ ఊరి ప్రజలకి పక్కనున్న పట్టణానికి వెళ్ళడానికి దూరం 30 కిలోమీటర్ల నుండి 10 కిలోమీటర్లకి తగ్గింది, ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఆ 1.5 కిలోమీటర్ల రోడ్డుని వేయడానికి ప్రభుత్వం 58 కోట్లు ఖర్చు అవుతుందని లెక్క కట్టింది, కానీ ఆ ఊరి ప్రజలు కేవలం 50 లక్షల రూపాయలతోనే ఆ రోడ్డుని వేసుకున్నారు.

 Villagers Build A Road With 50 Lakhs, That Government Said Would Cost 58 Crores

50 లక్షలతో అయిపోయే పనికి 58 కోట్ల రూపాయలు అవుతాయని లెక్క కట్టిందంటే ఆ ప్రభుత్వం ఎంత అవినీతిలో కూరుకుపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు, ప్రజల సోమ్ముని ప్రజల కోసం ఖర్చు పెట్టకుండా వారి జేబులు నింపుకోవడానికి వాడుకునే రాజకీయ నాయకులు ఉన్నంత కాలం మన దేశం బాగుపడదు.

Must Read:కేసీఆర్ కలల జెండా పోయి.. స్తంభం మాత్రమే మిగిలింది.

(Visited 4,232 times, 1 visits today)