వక్రతుండమహాకాయం కోటి సూర్య సమప్రభ నిర్విగ్నం కురుమేదేవ సర్వకార్యేశు సర్వదా… దేవుళ్ళంతా ఒక టైపైతే టైపైతే ఫ్రెండ్లీ గాడ్ గణేషా ఒక టైపు. పిల్ల లకీ ఫ్రెండ్లీగా అదే సమయం లో తొలి పూజలందుకునే మహా శక్తి రూపుడిగా డబల్ రోల్ లో కనిపించే గణేషుడు. మన పురాణాల్లో పెద్దగా అవతారాలెత్తలేదు సైలెంట్ గా తన పనేదో తాను చేసుకు పోయే గణేషుడు ఎంతైనా పిల్లోడే కదండీ…! అందుకే ఇప్పుడు సంవత్సరానికో అవతారం తో మనలని అలరిస్తున్నాడు.”థీం బేస్డ్ గణేశా” కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎన్నో థీం లతో వచ్చే గణేష్ ఎన్నో ప్రకటనలకి పేమెంట్ అడగని బ్రాండ్ అంబాసిడర్ ఐపోయాడు. ప్రతి సంవత్సరం ఒక్కో కొత్త గెటప్ తో విణాయకున్ని ట్రెండ్ ని అనుసరించి కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నారూ
కళాకారులు. వచ్చే ” గణేష్ ” ని ఒక సారి పలకరిద్దామా…
1.సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో గానీ వినాయకుడి మీద బానే ఉంది. “దబంగ్ గణేష” అంటూ బాలీవుడ్ సినీ అభిమానులను పలకరించే గణపతి టాలీవుడ్ కోసం “గబ్బర్ సింగ్ గణేష్” అవతారం ఎత్తాడు. మాస్ భక్తుల కోసం లుక్.
2.ఇప్పుడు సరికొత్త సంచలనం “బాహుబలి” కండల వీరుడు ప్రభాస్, రాణా లని చూసి గణపతికీ ఫిట్ నెస్ మీద గాలి మళ్ళినట్టుంది అమాంతం వర్కౌట్లు చేసేసి బాడీ పెంచేసాడు. శివలింగాన్ని ఎత్తుకోని ఉన్న తన ఫొటోలనీ విడుదల చేసాడు.
3.మరీ..! ఇండియన్ సినిమా లతోనే ఆగిపోతే ఎలా? హలీ వుడ్ భక్తులు మనసులో ఎట్టుకోరూ…! ఏమంటావ్ ఎలక..!
4.సెల్ఫీ లేటెస్ట్ క్రేజ్ ప్రతి చోటా ఒక సెల్ఫీ తీసుకోవటం దాన్ని ఫేస్ బుక్ లోనో ట్విట్టర్ లోనో పోస్ట్ చేసేయటం గణేషుడికీ నచ్చినట్టుంది ఫ్యామిలీ సెల్ఫీ తీస్కుంటున్నాడు..
5.ఏం దేవుళ్ళకి సరదాలుండవా ఆళ్ళుమాత్రం క్రికెట్టాడుకోరా..!? క్రికెట్ ఒక మతం అయిన భారత్ లో గణేషుడికీ క్రికెట్ అంటే మోజే… ఈ ఫోజు ఆ మధ్య “వరల్డ్ కప్పు కొట్టినప్పటిది”
6.పాపం సిద్దీ బుద్దీ అని ఇద్దరు భార్యలున్నా ఎప్పుడూ పెద్దగా కలిసున్నట్టు కనిపించడు ఇదేదో రేర్ ఫొటోనే…
7.దేవుదంటేనే మంచికోసం పోరాడేవాడు అప్పుడంటే ఆయుధాల పోరాటం చేసినా దేవుడికి హింస నచ్చదు అందుకే అన్నాహజారే తో అప్పట్లో సత్యాగ్రహ ధీక్షలో పాల్గొన్నాడు.
8. ఎప్పుడూ ఎలక మీదేనా బోరు కొట్టదూ…! అందుకే ఓసారికిలా ఆరేంజ్ క్యాబ్ వాడికి కాల్ చేసి కింగ్ కాంగ్ ని అరెంజ్ చేసుకున్న.
ఇవేకాదు మరిన్ని థీం లతో వచ్చిన గణేష్ అన్ని రూపాల్లోనూ అలరిస్తూ దీవిస్తున్నాడు. శిల్పుల ప్రతిభకీ వారి ఆదాయానికీ ఉపయోగ పడ్తున్న ఈ థీం బేస్డ్ గణేషా కాన్సెప్ట్ కేవలం ఫన్ తోనే ఆగిపోలేదు..”హెల్మెట్ పెట్టుకోండి నాలా అందరికీ రీప్లేస్ మెంట్ ఉండదు” అని ఒకసారి హెచ్చరిస్తే.. “ప్లాస్టిక్ మంచిదికాదు నాకు ప్లాస్టిక్ కవర్లలో నైవేధ్యం తేవద్దు” అంటూ మంచి చెబుతాడు “నాకు పత్రి ఉండాలి అంటే చెట్లు ఉండాలి” మరి అంటూ మన భాధ్యతనూ గుర్తు చేస్తాడు…
ప్రతి ఏటా ఒక కొత్త స్లోగన్ తో వచ్చే వినాయకుడు కొన్ని ఏళ్ళుగా “నన్ను రసాయనాలతో చెయ్యొద్దు అది నన్ను భాద పెడుతోందీ…!” అని చెబుతూనే ఉన్నా మనం పట్టించుకోవటం లేదు అందుకే ఈసారైనా మట్టి గణపతినే తెచ్చుకోండి.. ఆయన దీవెనెలందుకోండి..
అలజడి.కామ్ తరుపున వినాయక చవితి శుభాకాంక్షలు.