Home / Inspiring Stories / వీసా లేకుండానే మనం ఈ దేశాలకి వెళ్ళవచ్చు.

వీసా లేకుండానే మనం ఈ దేశాలకి వెళ్ళవచ్చు.

Author:

మనదేశం నుండి వేరే దేశానికి వెళ్లాలంటే ముందుగానే వీసా( పర్మిషన్) తీసుకోవాల్సి ఉంటుంది, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, యూరప్, సింగపూర్ లాంటి దేశాలకి వెళ్లాలంటే ఇక్కడ ఆ దేశానికి సంబంధించిన ఆఫీస్ లకి వెళ్లి సరైన పత్రాలు చూపించి, ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది, మనం వాళ్ళ దేశానికి ఎందుకు వెళ్తున్నామో, ఎన్ని రోజులు ఉంటున్నామో ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది, మన సమాధానాలు అక్కడి అధికారులకి నచ్చితేనే మనకి వీసా జారీ చేస్తారు,కానీ కొన్ని దేశాలకి మన పాస్ పోర్ట్ తో నేరుగా వెళ్లిపోవచ్చు ఎటువంటి వీసా అక్కర్లేదు, ఆ దేశపు విమానాశ్రయంలో దిగిన వెంటనే వీసా ఇచ్చేస్తారు.

visa-free-countries-for-indians

భారత దేశ పౌరులు వీసా అక్కర్లేకుండా వెళ్లగలిగే దేశాలు:

బొలీవియా – ఈ దేశానికి వెళ్ళగానే వీసా ఇస్తారు. 90 రోజుల గడువుంది

ఇండోనేషియా – ఈ దేశానికి వెళ్ళగానే 30 రోజులకు వీసా ఇస్తారు

ఆండోరా – ఈ దేశానికి భారతీయులు వీసా లేకుండా వెళ్ళి ఎన్ని రోజులైనా ఉండవచ్చు

మారిషస్ – ఈ దేశానికైతే అసలు వీసానే లేకుండా 90 రోజులుండవచ్చు

కేప్ వెర్డే – ఈ దేశానికి వెళ్ళగానే వీసా ఇస్తారు. గడువు లేదు.

జోర్డాన్ – అక్కడకు వెళ్ళగానే రెండు వారాలకు వీసా ఇస్తారు. కానీ చేతులో 3000 అమెరికన్ డాలర్లు ఉండాలనే నిబంధన ఉంది.

కెన్యా – ఈ దేశానికైతే వెళ్ళిన వెంటనే ఇస్తారు. దాంతో మూడు నెలలు అక్కడ ఉండవచ్చు.

ఫిజీ – ఈ దేశానికి అసలు వీసా లేకుండా నాలుగు నెలలు ఉండవచ్చు.

సోమాలియా – అక్కడికి వెళ్ళగానే ఇస్తారు. కానీ అక్కడికి వెళ్ళడానికి రెండు రోజుల ముందుగానే మిమ్మల్ని ఆహ్వానించిన వారు అక్కడి విమానాశ్రయంలో దరఖాస్తుని సమర్పించాలి.

పలావ్ – ఈ దేశానికి వెళ్ళగానే 30 రోజులకు వీసా ఇస్తారు.

సీషెల్స్ – ఈ దేశానికి వెళ్ళగానే 30 రోజులకు అనుమతి పత్రం ఇస్తారు.

హైతీ – ఈ దేశంలో అసలు వీసా లేకుండా 3నెలలు ఉండవచ్చు.

గునియా బిస్సావ్ – ఈ దేశానికి వెళ్ళగానే 90 రోజులకు వీసా ఇస్తారు.

డామినికా – ఈ దేశానికి వెళ్ళగానే 6నెలలకు వీసా ఇస్తారు.

నౌరూ – ఈ దేశానికి వెళ్లగానే ఇస్తారు. గడువు లేదు.

జమైకా – ఈ దేశానికి వీసా అక్కర్లేదు. గడువు కూడా లేదు.

ఈ సల్వడార్ – ఈ దేశంలో అసలు వీసా లేకుండా 90రోజులు ఉండవచ్చు.

సెయింట్ లూసియా – ఈ దేశానికి వెళ్ళగానే ఇస్తారు. 6 వారాలు గడువు.

మడగాస్కర్ – ఈ దేశానికి వెళ్ళగానే 90రోజులకు అనుమతిస్తూ వీసా ఇస్తారు.

సమో – ఈ దేశంలో వీసా లేకుండానే 30రోజులు ఉండవచ్చు.

లావోస్ – ఈ దేశానికి వెళ్ళగానే 30రోజులకు వీసా ఇస్తారు.

మాల్దీవులు – ఈ దేశానికి వెళ్ళగానే ఇస్తారు. 90రోజుల గడువు.

మైక్రోనేషియా – అక్కడకు వెళ్ళగానే ఇస్తారు. 30రోజుల గడువు.

శ్రీలంక – ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ అనే పద్ధతి అనుమతిస్తారు. గడువు 30 రోజులు.

నేపాల్ – ఈ దేశానికి వెళ్ళాలంటే పాస్ పోర్టు కూడా అక్కరలేదు. ఒక గుర్తింపు పత్రం ఏదైనా ఉంటే చాలు. అంతే కాక ఆ దేశానికి వచ్చేభారతీయులు స్వేచ్ఛగా తిరగడమే కాక అక్కడ జీవించవచ్చు కూడా.

టాంజానియా – వీసా అక్కడకు వెళ్ళగానే ఇస్తారు. గడువు లేదు.

కంబోడియా – అక్కడకు వెళ్ళగానే 30రోజులకు వీసా ఇస్తారు.

భూటాన్ – అక్కడకు వెళ్ళాలంటే వీసా అక్కరలేదు. గడువు కూడా లేదు.

పైన చెప్పిన ప్రతి దేశంలో పర్యాటక పరంగా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, అన్ని దేశాలలో చూడటానికి, పర్యటించడానికి ప్రత్యేక ప్రాంతాలు, అద్భుతమైన సముద్ర తీరాలు ఉన్నాయి, ఈ దేశాలలో పర్యటించడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని, మీరు ఈసారి టూర్ కి వెళ్లాలనికున్నపుడు ఈ దేశాల గురుంచి కూడా ఆలోచించండి.

Must Read: ఆధార్ కార్డుతో 7 రోజుల్లో పాస్ పోర్ట్ పొందొచ్చు.

(Visited 19,300 times, 1 visits today)