Home / Entertainment / వైజాగ్ లో 17న కంచె వేస్తున్నట్టేనా ?

వైజాగ్ లో 17న కంచె వేస్తున్నట్టేనా ?

Author:

చారిత్రాత్మక ప్రేమకథగా వస్తున్న కంచె మార్కెత్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలతోనే ఉంది. దర్శకుడు క్రిష్ తన స్టైల్ లో రూపొందించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రం ఆడియో వినాయిక చవితి సందర్బంగా సెప్టెంబర్ 17న వైజాగ్ లో హిస్టారికల్ పోర్ట్ స్టేడియంలో ఈ చిత్రం ఆడియోని విడుదల కానుంది. మొదట 12 నే అనుకున్నా అనుకోని కారణాల వల్ల 17 కు వాయిదా పడిందట.ఈ ఆడియో పవన్ కళ్యాన్ చేతిల మీదు గా జరగొచ్చని వార్తలు వచ్చిన్న  పవన్ రావటం అనుమానమే అంటున్నారు మరికొందరు.

పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా ఈ చిత్రం థియేటర్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఇప్పటికే రిలీజ్ అయిన కంచె ఫస్ట్ లుక్ మరియు టీజర్ అందరిలోనూ ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా వరల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్ లో రానుంది .అలాగే…స్వాతంత్రానికి ముందు జరిగే కథతో రూపొందే ఈ చిత్రం విడుదల తేదీ కూడా దేశభక్తికి చెందిన తేదీనే ఐఉండాలని అక్టోబర్ 2, అంటే గాంధీ జయింతి రోజున ఈ చిత్రం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

బ్రిటీష్ వారికి, జమీందార్ వ్యవస్ద కు వ్యతిరేకంగా సాగే పోరాటంతో కంచె కథ సాగనుంది. ఇక ఈ చిత్రంలో వరుణ్ తేజ సైనికుడుగా కనిపిస్తాడని తెలుస్తోంది. 1910 వ సంవత్సరంలో కథ జరుగుతుంది. వరుణ్ తేజ తనలోని లోని నటున్ని ‘కంచె’ చిత్రం ద్వారా వెలికి తెచ్చాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ సినిమాతో వరుణ్ హీరోగా నిలదొక్కుకోవడం ఖాయమనీ చెబుతున్నారు.

కంచె సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు’ సినిమాలో నటిచింది. రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందట. పీరియాడికల్ డ్రామాగా రూపొందబోయే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. తొలి సినిమా ట్రైలర్ తోనే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. ఎలానూ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అండ ఉండనే ఉంది. అందుకే రెండో సినిమాకే రెమ్యూనరేషన్ రూ.3 కోట్లు తీసుకుంటున్నాడట. దీని తర్వాత  వరుణ్ తేజ్ మరో చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్నాడు.  సి. కళ్యాణ్ నిర్మించబోతున్న చిత్రం  ఈ మధ్యనే ప్రారంభం అయ్యింది. లోఫర్ అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది.

(Visited 37 times, 1 visits today)